రైతును పెళ్లాడిన మంత్రి | kerala minister jayalaxmi marries farmer | Sakshi
Sakshi News home page

రైతును పెళ్లాడిన మంత్రి

May 11 2015 10:44 AM | Updated on Sep 3 2017 1:51 AM

రైతును పెళ్లాడిన మంత్రి

రైతును పెళ్లాడిన మంత్రి

కేరళలోని కాంగ్రెస్ సభ్యురాలు, ఏకైక గిరిజన మంత్రి పి.కె. జయలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, సమీప బంధువు, రైతు అయిన సి.ఎ. అనిల్కుమార్ను ఆమె పెళ్లాడారు.

కేరళలోని కాంగ్రెస్ సభ్యురాలు, ఏకైక గిరిజన మంత్రి పి.కె. జయలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, సమీప బంధువు, రైతు అయిన సి.ఎ. అనిల్కుమార్ను ఆమె పెళ్లాడారు. సంప్రదాయ కురిచియ గిరిజన పద్ధతిలోనే ఆమె పెళ్లి చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్, కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు.. అందరూ కొత్త జంటను అభినందనలలో ముంచెత్తారు. కళ్యాణమండపంలోకి వెళ్లడానికి ముందుగా జయలక్ష్మి ముఖ్యమంత్రి చాందీ, అచ్యుతానందన్ల పాదాలకు నమస్కరించారు.

అయితే.. తమ సంప్రదాయం ప్రకారం ఏమీ మాట్లడకూడదు కాబట్టి.. పెళ్లి అయ్యవరకు ఆమె మౌనంగానే ఉండిపోయారు. కేరళ గిరిజన సంక్షేమ, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న జయలక్ష్మి.. కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలు. గిరిజన తెగలలో ఆమె తెగను బ్రాహ్మణులుగా పరిగణిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement