
నేను 'కుమారి'ని కాను.. 'శ్రీమతి'ని!
కేరళ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి.. పీకే జయలక్ష్మి. పెళ్లయిపోయినా కూడా ఇప్పటికీ ఆమెను చాలామంది కుమారి జయలక్ష్మి అనే పిలుస్తున్నారట.
కేరళ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి.. పీకే జయలక్ష్మి. ఇటీవలే ఆమె తన చిన్ననాటి స్నేమితుడు అనిల్ కుమార్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లయిపోయినా కూడా ఇప్పటికీ ఆమెను చాలామంది కుమారి జయలక్ష్మి అనే పిలుస్తున్నారట. దాంతో కొంచెం కోపగించుకున్న ఆమె.. తనను కుమారి అని కాకుండా శ్రీమతి జయలక్ష్మి అని పిలవాలంటూ అందరికీ ఓ సర్క్యులర్ జారీ చేసిపారేశారు.
మే 10వ తేదీన జయలక్ష్మికి పెళ్లయింది. ఆ పెళ్లికి ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హాజరై.. కొత్త దంపతులను ఆశీర్వదించారు. అయినా ఇప్పటికీ తనను చాలామంది కుమారి జయలక్ష్మి అనే లేఖలలో సంబోధిస్తుండటంతో మంత్రి గారికి చికాకు వచ్చి ఈ రకంగా సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది.