అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
Published Fri, Aug 12 2016 11:52 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
కట్టంగూర్ : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ముత్యాలమ్మగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కారింగు దుర్గయ్య(45) తనకున్న మూడు ఎకరాలతోపాటు మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. అయితే రెండేళ్లుగా వర్షాభావంతో సాగు చేసిన పత్తి ఎండిపోవటంతో రైతు అప్పులపాలయ్యాడు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆరెకరాల్లో వేరుశనగ, కంది, పెసర, వరిపంటలు సాగుచేశాడు. అయితే సరిగ్గా వర్షాలు లేక పంటలు వాడుబారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేసిన అప్పులు ఎలా తీరుతాయనే మనస్తాపంతో శుక్రవారం మధ్యాహ్నం వేరుశనిగచేను వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొనఊపిరితో ఉన్న దుర్గయ్యను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమకు సుమారు రూ.5లక్షల అప్పు ఉన్నట్లు మృతుడి భార్య తెలిపింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు. కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య శ్యామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు.
Advertisement