తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
చింతపల్లి: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కీడేరుకు చెందిన మల్లయ్య (55) అనే రైతు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనకున్న ఐదెకరాల పొలంలో అప్పుచేసి వేసిన పత్తి పంట ఎండిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లయ్య పురుగుల మందుతాగి తనువుచాలించాడు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.