యువరైతు ఆత్మహత్య ఏడు నెలల క్రితం భార్య..
కలిసిరాని సాగు.. పెరిగిన అప్పులే కారణం
సుతారిపల్లిలో విషాదం
రామాయంపేట: రైతు కుటుంబంలో మరో విషాదం. ఈసారి ఏకంగా రైతే ప్రాణాలు తీసుకున్నాడు. కరువు కారణంగా కలిసి రాని సాగు.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. ఇదిలావుంటే సరిగ్గా ఏడు నెలల క్రితమే ఇతని భార్య ఆత్మహత్య చేసుకుం ది. రైతు ఆత్మహత్య ఘటన మండలంలోని రాయిలాపూర్ పంచాయతీ పరిధిలోని సుతారిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రా మస్తుల కథనం ప్రకారం... సుతారిపల్లికి చెందిన రాగి పెద్దవాలోల్ల బాల య్య, పోచవ్వ దంపతులకు కొడుకు శ్రీకాంత్(28)తోపాటు ఇద్దరు కూతుర్లున్నారు. బాలయ్య మానసిక వికలాంగుడు. శ్రీకాంత్ వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అప్పులు చేసి ఓ సోదరి వివాహం చేశాడు. మరో సోదరి పెళ్లీడుకు వ చ్చింది.
తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో గత ఏడాది మూడు బోర్లు తవ్వగా చుక్క నీరు రాలేదు. వేసిన మొక్కజొన్న సైతం ఎండిపోయింది. ప్రస్తుతం అతని భూమి బీడుగా ఉంది. రూ.5లక్షల వర కు అప్పుల పాలైన శ్రీకాంత్‌కు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. మరోవైపు 20 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గత మే నెల 2న పుట్టింటికి వెళ్లిన శ్రీకాంత్ భార్య లావణ్య అక్కడ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటివారు శ్రీకాంత్‌తోపాటు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టా రు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన శ్రీకాంత్ హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. మంగళవారం గ్రామానికి వచ్చాడు. ఇంట్లో అందరుపడుకున్న తరువాత అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ నాగార్జునగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కరువు కాటు..
Published Wed, Dec 2 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
Advertisement
Advertisement