ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతుల తొలగింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని రైతాంగం వినియోగిస్తున్న 13.5 ల క్షల మోటార్లు మార్చుకోవాల్సిందేనని ఏపీ మంత్రిమండలి నిర్ణయించింది. రైతులు ప్రస్తుతం వినియోగిస్తున్న మోటార్ల వల్ల విద్యుత్ దుబారా అవుతుందని, దుబారాను నివారించాలంటే వాటి స్థానంలో ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మోటార్లను బిగించుకోవాలని మంత్రిమండలి తీర్మానించింది. కొత్త మోటార్లను బిగించుకోవడంవల్ల వినియోగంలో 25 శాతం మేరకు విద్యుత్ ఆదా అవుతుందని ప్రభుత్వం లెక్కలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణతో కలిసి సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి లేక్‌వ్యూ అతిధి గృహంగా ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై మీడియాకు వివరించారు.
రైతు రుణాల మాఫీపై ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని, గత మంత్రివర్గ సమావేశంలోనే చర్చించామని చెప్పారు. రైతులు కొత్త మోటార్లను మార్చుకునేందుకు అయ్యే ఖర్చులో 80 నుంచి 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా లేదా రైతులు భరిస్తారా అనే అంశాన్ని వెల్లడించలేదు. అలాగే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ తొలగిస్తారు. వీరిలో 99 శాతం మంది అవినీతిపరులని, ప్రతి ఒక్కరూ లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పారు. ఆదర్శ రైతులందరినీ తొలగించాలని నిర్ణయించారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కర్నూలులో నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది.
రైతులు మోటార్లు మార్చుకోవాల్సిందే
Published Sun, Jun 29 2014 1:22 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement