ఏటూరునాగారం: అకాల వర్షానికి మిర్చి తడవగా, నష్టం జరుగుతుం దని మనోవేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొమ్యూర్‌లో బెడిక బాలంకయ్య రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మిర్చి తడవడంతో నష్టం వస్తుందని మనోవేదనతో సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మరణించాడు.