నల్గొండ జిల్లా దేవరకొండ మండలం వెంకటంపేట గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధతో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ మండలం వెంకటంపేట గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధతో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు...వెంకటంపేట గ్రామానికి చెందిన జక్కుల చంద్రయ్య(45)కు మూడెకరాల పొలం ఉంది. అయితే అందులో వేసిన పంట దిగుబడి సరిగా రాలేదు. పైగా పంటవేసేందుకు చేసిన అప్పు పెరిగిపోవడంతో తట్టుకోలేక తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందాడు. బుధవారం ఉదయం గమనించిన ఇరుగుపొరుగు పొలాలకు చెందిన రైతులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.