మహానంది: కర్నూలు జిల్లాలో మరో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, తెచ్చిన రుణంపై పెరిగిన వడ్డీ ఓ యువ రైతు ప్రాణాలు బలిగొన్నాయి. ఈ సంఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాబు హుస్సేని (28) పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పైగా పంట సాగు కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతుండడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో శుక్రవారం పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.