
పాముకాటుతో రైతు మృతి
అర్వపల్లి:
పాముకాటుతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొమ్మాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన దూదిగామ మల్లయ్య గురువారం రాత్రి పొలం వద్దకు వెళుతుండగా మార్గమధ్యలో పాముకాటు వేసింది. వెంటనే అతడిని 108 వాహనంలో సూర్యాపేటకు తరలిస్తుండగా మధ్యలోనే మరణించాడు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య కొంత కాలం కిందట మరణించింది. తల్లిదండ్రి ఇద్దరు మరణించడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కుంట్ల సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ తాడూరి రామకోటి కోరారు.