పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఖమ్మం : పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండ మండలం నాచేపల్లి గ్రామంలో ఓ రైతు పట్టాదారు పుస్తకాల కోసం వీఆర్వో తేజావత్ లక్ష్మణ్‌కి అర్జీ పెట్టుకున్నారు. అందుకు వీర్వో రూ. 15వేలు డిమాండ్ చేశాడు. చేసేది లేక రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ]
ఈ నేపధ్యంలో ఏసీబీ అధికారులు వలపన్నారు. శనివారం రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(నేలకొండపల్లి)