తీసుకున్న అసలు కన్నా వడ్డీలు ఎక్కువగా కడుతున్న ఒక రైతు చివరకు ఎటూ దారిలేక ఆత్మహత్య చేసుకోవడానికి సెల్‌ఫోన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడెపల్లి మండలం పెనమాక గ్రామంలో జరిగింది. పెనమాకకు చెందిన పాతూరి సత్తిబాబు అవసరాల నిమిత్తం గ్రామానికే చెందిన వడ్డీ వ్యాపారి అంకమ్మ రెడ్డి నుంచి రూ.40 వేలు అప్పుగా తీసుకున్నాడు.
కాగా, అంకమ్మరెడ్డి ప్రతి నెల వడ్డీ పేరుతో అదనంగా వసూలు చేయడంతో పాటు, బలవంతంగా తన ఇంటిని రాయించుకోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సత్తిబాబు ఆత్మహత్యే తనకు మార్గమని సెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు రైతు సత్తిబాబుతో మాట్లాడి బుజ్జగించి కిందకు దించారు.
అధికవడ్డీ కట్టలేక టవరెక్కిన రైతన్న
Published Tue, Jan 20 2015 5:44 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM
Advertisement
Advertisement