cellphone tower
-
జనగామలో ప్రభాస్ అభిమాని హల్చల్
-
ప్రభాస్ రాకపోతే.. టవర్ నుంచి దూకేస్తా!
సాక్షి, జనగామ: సినీ తారలకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉంటారు. తమ అభిమాన తారను చూసేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాను. కానీ, అభిమానం ముదిరి.. వెర్రీగా మారితేనే చిక్కు! అలాంటి ఘటన జనగామలో చోటుచేసుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఓ యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. అత్యంత ప్రమాదకరంగా సెల్ టవర్ అంచు మీద నిలబడి.. ప్రభాస్ వస్తేనే టవర్ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు. జనగామ జిల్లా యశ్వంత్‌పుర పెట్రోల్ బంక్ పక్కన ఉన్న సెల్ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు. గుగులోతు వెంకన్నది మహబూబాబాద్. అతడు ప్రభాస్ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని సెల్ టవర్‌పైకి ఎక్కిన వెంకన్న డిమాండ్ చేస్తున్నాడు. తనను చూసేందుకు, కలిసేందుకు ప్రభాస్ రాకపోతే సెల్ టవర్ పై నుంచి దూకేస్తానని అతను బెదిరించాడు. ఇదేమీ విడ్డూరమని విస్తుపోతున్న స్థానికులు.. యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
బ్యాటరీ.. నో వర్రీ!
సెల్‌ఫోన్ చార్జ్ అయిపోతోంది..! చార్జర్ మరచిపోయా.. ఫోన్ డెడ్ అయింది.. కరెంటు పోయింది.. ఫోన్ చార్జ్ చేసుకునేదెలా? ఇలా ఎన్నోసార్లు మీరు అనుకునే ఉంటారు. ఇకపై వీటికి రాం! రాం! చెప్పేయొచ్చు. ఎలాగంటారా? యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు బ్యాటరీనే అవసరం లేని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి పరిచారు. బ్యాటరీ లేకుండా ఎలా పని చేస్తుందా అనే కదా మీ అనుమానం. గాల్లోని రేడియో తరంగాలు.. సౌర శక్తితో ఈ ఫోన్ పనిచేస్తుందన్న మాట. స్మార్ట్ఫోన్లలో అతి ముఖ్యమైన ప్రక్రియ ఏది? మన మాటల్ని ఫోన్‌కు అర్థమయ్యే డిజిటల్ భాషలోకి మార్చడం. డిజిటల్ రూపంలోని మాటలను మనకు వినపడేలా చేయడం. ఈ రెండు ప్రక్రియలకు బోలెడంత విద్యుత్తు ఖర్చవుతుంది. ఈ కారణంగానే రేడియో తరంగాల గురించి చాలాకాలంగా తెలిసినప్పటికీ దాన్ని వాడుకోగల టెక్నాలజీ అభివృద్ధి కాలేకపోయింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ వాసింగ్టన్ శాస్త్రవేత్తలు ఫోన్లలోని మైక్రోఫోన్ లేదా స్పీకర్ తాలూకు ప్రకంపనల వల్ల పుట్టే శక్తితోనే మాటలు డిజిటల్లోకి.. డిజిటల్ సంకేతాలు మాటల్లోకి మారేలా చేయగలిగారు. అయినా ఈ ఫోన్‌కు దాదా పు 3.5 మైక్రోవాట్ల విద్యుత్తు అవసరమైంది. ఈ విద్యుత్‌ను ఫోన్‌కు దూరంగా ఉన్న ఓ పరికరం ద్వారా విడుదల చేసిన ఖీరేడియో సంకేతాల ద్వారా పుట్టించారు. ఒకవేళ రేడియో తరంగాల ప్రసారానికి అవకాశం లేకపోతే.. చిన్న సైజు సౌర ఫలకాల ద్వారా కూడా ఈ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. భవిష్యత్తులో ప్రతి సెల్‌ఫోన్ టవర్ లేదా వైఫై రూటర్ల ద్వారా కొన్ని రేడియో సంకేతాలను ప్రసారం చేస్తే చాలు.. ఎక్కడైనా బ్యాటరీల్లేకుండానే ఫోన్లు పనిచేస్తాయని వంశీ తాళ్ల అనే భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పేర్కొంటున్నారు. ఈ టెక్నాలజీతో సిద్ధం చేసిన ఓ నమూనా ఫోన్‌ను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించామని బ్యాటరీ లేకుండానే స్కైప్ కాల్స్ కూడా చేశామని గొల్లకోట శ్యామ్ అనే మరో శాస్త్రవేత్త తెలిపారు. -
కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యా బెదిరింపు
కేకే.నగర్: మదురవాయల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అరుళ్ అన్భరసన్ ప్రకటించాలని కోరుతూ గురువారం ఉదయం పూందమల్లిలోని 150 అడుగుల ఎత్తు గల సెల్‌ఫోన్ టవర్‌పై ఎక్కి కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యా బెదిరింపు చేసిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. పూందమల్లి సమీపంలోని కుమనన్ చావడి బస్టాండు సమీపంలో బీఎస్ఎన్ఎల్ సెల్‌ఫోన్ టవర్ ఉంది. దీని సమీపంలో గురువారం ఉదయం 10.30 గంటలకు తిరువళ్లూర్ పార్లమెంటు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ సహాయ అధ్యక్షుడు ఆవడి ధనా ఆధ్వర్యంలో 15కు పైగా కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడారు. వారందరూ మధురవాయల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అన్భరసన్‌ను ప్రకటించాలని నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆ గుంపు మధ్య నుంచి అయ్యప్పన్ తాంగల్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త కేశవన్ (34) కాంగ్రెస్ పార్టీ జెండాతో బీఎస్ఎన్ఎల్ టవర్ పైకి ఎక్కాడు. 150 అడుగుల ఎత్తు టవర్‌పై జెండాతో నిలబడి అరుల్ అన్భరసన్‌ను అభ్యర్థిగా ప్రకటించే వరకు తాను కిందకు దిగనని అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. సమాచారం అందుకుని పూందమల్లి అసిస్టెంట్ కమిషనర్ అయ్యప్పన్, పోలీసులు అక్కడకు చేరుకుని కేశవన్‌ను కిందకు దిగమని హెచ్చరించారు. ఆ తరువాత కేశవన్ కిందకు దిగి రావడంతో కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
అధికవడ్డీ కట్టలేక టవరెక్కిన రైతన్న
తీసుకున్న అసలు కన్నా వడ్డీలు ఎక్కువగా కడుతున్న ఒక రైతు చివరకు ఎటూ దారిలేక ఆత్మహత్య చేసుకోవడానికి సెల్‌ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడెపల్లి మండలం పెనమాక గ్రామంలో జరిగింది. పెనమాకకు చెందిన పాతూరి సత్తిబాబు అవసరాల నిమిత్తం గ్రామానికే చెందిన వడ్డీ వ్యాపారి అంకమ్మ రెడ్డి నుంచి రూ.40 వేలు అప్పుగా తీసుకున్నాడు. కాగా, అంకమ్మరెడ్డి ప్రతి నెల వడ్డీ పేరుతో అదనంగా వసూలు చేయడంతో పాటు, బలవంతంగా తన ఇంటిని రాయించుకోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సత్తిబాబు ఆత్మహత్యే తనకు మార్గమని సెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు రైతు సత్తిబాబుతో మాట్లాడి బుజ్జగించి కిందకు దించారు.