దళితులకు సాగు భూమి పంపిణీ | land distribution to dalits : sarath | Sakshi
Sakshi News home page

దళితులకు సాగు భూమి పంపిణీ

Published Wed, Nov 19 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

land distribution to dalits : sarath

కొండపాక: నిరుపేదలైన దళితులకు వ్యవసాయ యోగ్యమైన సాగుభూమిని పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీలో భాగంగా ఆయన ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి కొండపాక మండలం బందారంలోని భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. భూముల ధరలపై నేతలను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

పంపిణీ కోసం కొనుగోలు చేయనున్న భూమి సారవంతైమైనదేనా, లబ్ధిదారులు సం తృప్తిగా ఉన్నారా అని  ప్రశ్నించారు.  భూ మి పంపిణీ చేయడానికి ముందే ముళ్లపొదలను తొలగించి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మానరేందర్, తహశీల్దార్ పరమేశ్వర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement