kondapaka
-
ఎమ్మెల్సీగా నాకు తృప్తి లేదు: కౌశిక్ రెడ్డి
-
విధులకు డుమ్మా కొట్టి.. విందులో చిందులు
కొండపాక(గజ్వేల్): పనివేళల్లో విధులకు డుమ్మా కొట్టి విందులు, వినోదాల్లో మునిగితేలారు సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది. జిల్లాలోని 22 మండలాల పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు శుక్రవారం కొండపాక శివారులోని ఓ మామిడి తోటలో సమావేశమై విందులు చేసుకుంటూ చిందులు వేశారు. ఈ వ్యవహారం కాస్తా టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీరియస్ అయ్యారు. కొండపాక ఎంపీడీఓ రాజేశ్‌ను కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) నర్సింగరావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చదవండి: Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు! -
భార్యపై కోపం..అత్తింటిపై పెట్రోల్‌తో దాడి
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా అత్తింటిపై అల్లుడు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు. బామ్మర్దిపై కోపంతో అతనిపై కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో అతని భార్య విమలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు (ఐదుగురు) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అతని భార్య విమల, ఇద్దరు కుమార్తెలు, బావమరిది రాజు, మరదలు సునీత తీవ్రంగా గాయపడ్డారు. కాగా విమలకు లక్ష్మీరాజంతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైందని, కొంత కాలం తరువాత వారి మధ్య విభేదాలు వచ్చినట్టు స్థానికులు బెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమల రెండేళ్ల నుంచి తల్లి ఇంటి వద్దే ఉంటోదని, భార్యపై కోపంతోనే ఆమె కుంటుంబ సభ్యులను హతమార్చాలని ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య
-
ప్రభుత్వ పాఠశాలలో ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని కొండపాక మండలం లకుడారం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గ్రామానికి చెందిన కనకయ్య(21), తార(19) అనే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య, రాచకొండ తారా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో మందలించారు. రెండేళ్ల క్రితం ఇదే విషయంలో గ్రామపెద్దలు కనకయ్యకు 30వేలు జరిమానా విదించారు. అయినా కనకయ్య, తార మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి..ఆ గ్రామంలోని స్కూల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలం కావడంతో...వారి వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం స్కూల్లోని ఓ గదిలో వెళ్లి ఒకే తాడుతో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య -
గొర్రెలకు ఏం తెలుస్తుంది గొర్రెల విలువ: కేసీఆర్
సిద్దిపేట: మూడేళ్లలో గొర్రెలపై తెలంగాణ యాదవులు, కురుమలు రూ.25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విషయం చాలామంది గొర్రెలకు (పరోక్షంగా విపక్షాలను ఉద్దేశిస్తూ) అర్థంకాదని విమర్శించారు. 2024నాటికి తెలంగాణ బడ్జెట్ 5కోట్లకు చేరుతుందని అన్నారు. మంగళవారం సిద్దిపేటలో పర్యటనలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. డోలు వాయించి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈసందర్భంగా 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు కేసీఆర్ అందజేశారు. ఒక్కో లబ్దిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో మొత్తం 7 లక్షల 18వేల మందికి కోటిన్నర గొర్రెలను పంపినీ చేస్తాం. మూడేళ్లలో వీటి ద్వారా 25 వేల కోట్ల ఆదాయం వస్తుంది. గొర్రెలకు వైద్యం కోసం 1962 టోల్ ఫ్రీ నెంబర్ కేటాయిస్తున్నాం. 2024నాటికి తెలంగాణ బడ్జెట్ 5లక్షల కోట్లకు చేరుతుంది. రైతులకు నీళ్లు, కరెంట్, పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది. ఎకరాకు రూ.4వేల ఎరువులు పెట్టుబడిగా ఇస్తాం. గ్రామీణ తెలంగాణ వికాసమే మా లక్ష్యం. కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం. విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా కొండపాకకు గోదావరి నీళ్లు వస్తాయి’ అని కేసీఆర్ అన్నారు. -
జీవితం బ్యాంకుల పాలు.. చలిలో బారెడు కష్టాలు
కొండపాక: నల్లధనం కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులను ఇంకా కలవరంలోనే ఉంచింది. వారి దిన చర్య బ్యాంకుల వద్దే సరిపోతోంది. డబ్బుల కోసం రోజూ గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూ కడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల చలామణి గడువు దగ్గర పడుతున్న కొద్దీ బ్యాంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. దీంతో చలిలోనే వణుకుతూ దూర ప్రాంతాల్లోని బ్యాంకుల వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు పెద్దనోట్ల రద్దు తిప్పలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. బ్యాంకర్లు తమ ఇష్టా రీతిన చేస్తున్నారు. ప్రజలకు ఓ రోజూ రూ. 2 వేలు , మరో రోజూ రూ. 4 వేలు చేతిలో పెడుతుండటంతో అవి సరిపోక నానా కష్టాలు పడుతున్నారు. కొండపాక మండలంలో దుద్దెడ, కొండపాకల్లో ఆంధ్రా బ్యాంకులు, కుకునూరుపల్లిలో మంజీరా గ్రామీణ వికాస్ బ్యాంకు , సిర్సనగండ్లలో (ఎస్బీహెచ్ ఏడీబీ లింకప్) కౌషిక్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిదిలో దుద్దెడ, కొండపాక, దమ్మక్కపల్లి, సిర్సనగండ్ల , జప్తినాచారం, మంగోల్, మేదినీపూర్, తిప్పారం, ముద్దాపురం, తిమ్మారెడ్డిపల్లి, లకుడారం, వెలికట్ట, ప్రక్క మండలంలోని పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల ప్రజలకు ఖాతాలున్నాయి. అయితే, వారానికి రూ. 24 వేలవరకు బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను మాత్రం ఈ బ్యాంకులు అస్సలు పాటించడంలేదని ఖాతాదారులు వాపోతున్నారు. ఒక్కొక రోజైతే రూ. 2వేలకు గంటల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీప్ సీజన్లో పండించిన పంటల డబ్బు బ్యాంకుల్లో జమ ఉండటంతో రబీ సీజన్ వ్యవసాయ పనులకు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తిందంటున్నారు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు అవసరాలకు సరిపడా రాకపోతుండటంతో కొందరి సామాన్య కుటుంబాల్లో పూట గడువని దుస్తితులు కూడా నెలకొన్నాయి. కొన్ని గ్రామాల్లో ఖరీప్‌లో వేసుకున్న పత్తి పంటలు పెద్ద నోట్ల రద్దు కారణంగా కూలీల కొరత ఏర్పడి పంట మొత్తం చేలల్లోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాపారస్తులను, చిల్లర దుకాణా దారులను, టీ కొట్టు వ్యాపారులను, వ్యవసాయ కూలీలను, ఇతర పనుల కూలీలను, వ్యవసాయదారులను పెద్ద నోట్ల రద్దు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. -
కారు-లారీ ఢీ, ఇద్దరి మృతి
మెదక్: జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరోకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాల సరఫరాదారులకు దసరా బోసన్
కొండపాక: విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి పాలు సరఫరాచేస్తున్న రైతులకు దసరా బోనస్ పంపిణీ చేశామని సిర్సనగండ్ల విజయ పాల ఉత్పత్తి దారులు సహకార సంఘం చైర్మన్ గూడెపు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సిర్సనగండ్ల విజయ పాల ఉత్పత్తిదారులు సహకార సంఘం, పాల సరఫరాదారులు సంఘం అధ్యక్షుడి తీర్మానం మేరకు శనివారం రూ.3.68 లక్షలు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట విజయ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని కొండపాక మండలం సిర్సనగండ్ల బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ)కు మంచి పేరుందన్నారు. ఈ యూనిట్ నుంచి మర్పడ్గ, కొండపాక, గిరాయిపల్లి, బందారం, అంకిరెడ్డిపల్లి నుంచి రైతులు పాలు సరపరాచేస్తుంటారని తెలిపారు. దీంతోపాటు మరో 15 నాన్సొసైటీలు, డైరీ ఫారాల నుంచి కూడా పాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. సిర్సనగండ్ల పరిధిలోని రైతులకు రూ.99,188, బందారం సొసైటీ పరిధిలోని రైతులకు రూ.18,570, గిరాయిపల్లి సొసైటీ పరిధిలోని రైతులకు రూ.8,549, అంకిరెడ్డిపల్లి పరిధిలోని రైతులకు రూ.24,576, కొండపాక సొసైటీ పరిధిలోని రైతులకు రూ.4,111లు బోనస్ పంపిణీ చేశామని వెల్లడించారు. బోనస్ పంపిణీ చేయగా మిగిలిన రూ.10 లక్షలు సొసైటీ పేరిట నిల్వ ఉన్నాయన్నారు. రైతులకు దసరా, బతుకమ్మ, మొహర్రం, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో కొండపాక, గిరాయిపల్లి, బందారం, అంకిరెడ్డిపల్లి సొసైటీల చైర్మన్లు కృష్ణమూర్తి, లలిత, పద్మ, రాంచంద్రం, సిబ్బంది క్యాతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అలుగు పారుతున్న చెరువులు
కొండపాక: కొండపాక మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసింది. 38.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసిల్దార్ విజయ్‌భాస్కర్‌జీ తెలిపారు. మండలంలోని సిర్సనగండ్ల, గిరాయిపల్లి, దమ్మక్కపల్లి, కొండపాక, వెలికట్ట, జప్తినాచారం గ్రామాల్లోని చెరువులు మరోసారి అలుగుపారాయి. 20 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు చెరువులు అలుగులు పారడంతో రైతులు సంబరపడుతున్నారు. -
టోల్గేట్పైకి దూసుకెళ్లిన బస్సు: ఒకరికి గాయాలు
మెదక్ : మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి టోల్గేట్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పరశురామ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాటిన మొక్కలకు పర్యవేక్షణ కరువు
పశువులకు ఆహారంగా మారుతున్న వైనం పట్టించుకోని అధికారుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్న పర్యావరణ ప్రేమికులు కొండపాక: వర్షాలు సమృద్దిగా కురవాలంటే పర్యావరణ పరిరక్షణ ఒక్కటే పరిష్కారమని గుర్తించిన ప్రభుత్వం హరితహారం చేపట్టింది. దీని కోసం కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. అయితే నాటిన మొక్కలను పర్యవేక్షణ చేయకపోవడంతో ఎండిపోతున్నాయి. అంతేకాకుండా మేకలు, గొర్రెలకు ఆహారంగా మారాయి. అధికారులు గట్టిచర్యలు తీసుకుని హరితహారం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని కోరుతున్నారు. హరితహారం కోసం మండలంలో ఈజీఎస్, అటవీశాఖ ఆధ్వర్యంలో ఆరు నర్సరీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి నుంచి మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు మొక్కలు సరఫరాచేస్తున్నారు. ఈజీఎస్ కింద ఖమ్మంపల్లిలో లక్ష మొక్కలు పెంపకం చేపట్టగా, కొండపాక, లకుడారం, వెలికట్ట, మేదినీపూర్, కుకునూరుపల్లి, మర్పడ్గ కేంద్రాల్లోని ఒక్కొక్క నర్సరీలో 75 వేల మొక్కలపెంపకం చేపట్టారు. మండల వ్యాప్తంగా 4.70 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు కూడా తయారుచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, దేవాలయ ప్రాంగణాలు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖ రోడ్లకు ఇరువైపులా, పొలాల గట్లపై సుమారు నాలుగు లక్షల మొక్కలు నాటినట్లు ఇంచార్జి ఎంపీడీఓ ఆనంద్‌మేరీ వివరించారు. ఈ మొక్కలను ఈజీఎస్ పథకంలో నాటడం జరిగిందని పేర్కొన్నారు. కానీ నాటిన మొక్కలను సంరక్షించే చర్యలను మాత్రం అధికారులు, పాలకులు గాని చర్యలుతీసుకోకపోవడంతో మేకలకు ఆహారంగా మారాయి. దుద్దెడ నుంచి మర్పడ్గ, సిర్సనగండ్ల నుంచి ఓదన్చెర్వుల మార్గంలో నాటి మొక్కలు సంరక్షించకపోవడంతో ఎండు పుల్లలుగా మారిపోయాయి. వాటిని చూసిన ప్రయాణికులు, పాదచారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి సంరక్షణపై శీతకన్నువేయడం సరికాదని తప్పుబడుతున్నారు. వెంటనే తగుచర్యలు తీసుకుని మిగిలిన మొక్కలను కాపాడాలని కోరుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరందించాలి మొక్కలు నాటారు మంచిదే కానీ పెరిగే వరకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. గతంలో వృక్షాలు అధికంగా ఉండటంతో వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రస్తుతం చెట్లు లేక వర్షాలు పడటంలేదు. అందుకే వరుస కరువు పరిస్థితి. - లక్ష్మి, కొండపాక కంచే ఏర్పాటు చేయాలి ఈజీఎస్ పథకంలో చాలా మొక్కలు నాటారు. వాటి రక్షణకు చుట్టూ కంచె పెట్టించాలి. లేకపోతే మేకలు, పశువులు మేయడం ఖాయం. చర్యలు తీసుకోకుండా ఎంతో ఖర్చు పెట్టి మొక్కలు పెట్టిస్తే ఏం లాభం. వెంటనే కంచె ఏర్పాటు చేసేలా చూడాలి. - బాలవ్వ, వెలికట్ట ట్యాంకర్ల ద్వార నీరందిస్తాం... సకాలంలో వర్షాలు కురువాలన్న మంచి ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం పథకాన్ని చేపట్టింది. నాటిన మొక్కలు ఎండిపోకుండా చేసేందుకు ఈజీఎస్ సిబ్బందితో సర్వేబుల్ రిపోర్టులను అప్లోడ్ చేయిస్తుంది. పూర్తి కాగానే ట్యాంకర్ల ద్వారా నీరందించడంతో పాటు రక్షణ కోసం కంచెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - ఆనంద్‌మేరీ, ఇంచార్జి ఎంపీడీఓ -
నత్తనడకన ‘భగీరథ’ నిర్మాణాలు
పట్టించుకోని అధికారులు పనుల జాప్యంపై గ్రామస్తుల ఆగ్రహం వేగంగా చేయించాలని ప్రభుత్వానికి వినతి కొండపాక: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి అధికారుల్లు, కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. భగీరథ నీటిని గడప గడపకు అందిస్తామన్న నేతల మాటలతో గ్రామస్తులు ఆశలు పెంచుకున్నారు. అయితే పనులు నత్తనడకనసాగుతుండటంతో నిరాశచెందుతున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా చూపిన శ్రద్ధ ఆ తర్వాత చూపడంలేదని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొండపాక మండలానికి ప్రభుత్వం రూ.13 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 149 కి.మీ మేర అంతర్గత పైప్‌పనులు చేపట్టినట్టు మండల ఏఈ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. వీటితోపాటు గ్రామాల్లో నూతనంగా 20 రక్షిత నీటి ట్యాంకులు నిర్మించేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారి పక్కన, గజ్వేల్ మండలంలోని కోమటిబండ వద్ద భారీ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు చేపట్టారు. అంతర్గత పైప్‌లైన్ పనులు కూడా పూర్తిచేశారు. 20 ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో సిర్సనగండ్ల, లకుడారం మధిర సాకులగడ్డ, జప్తినాచారం మధిర రాజంపల్లి, సిర్సనగండ్ల మధిర ఓదన్‌చెర్వు, తిమ్మారెడ్డిపల్లి మధిర సార్లవాడల్లో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకులకు పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీటి సరఫరా జరగడంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా గిరాయిపల్లిలో నల్లా కనెక్షన్ పనులు గందరగోళంగా ఉన్నాయని, దీంతో అందరికీ సమానంగా నీటి సరఫరా జరిగే అవకాశం లేదని అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అంతేకాకుండా సిర్సనగండ్లలో నాలుగు జోన్లకుగాను రెండు జోన్ల పైప్‌లైన్ కనెక్షన్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. ప్రధాని ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు హడావుడి చేశారని, అనంతరం గ్రామానికి రావడంలేదని పేర్కొంటున్నారు. ఇప్పటి కైనా అధికారులు చర్యలు తీసుకుని పనులు వేగంగా జరిగేలా చూడాలని కోరతున్నారు. కనెక్షన్ ఇవ్వలేదు రాజంపల్లి గ్రామంలో మంచి నీటి ట్యాంకును నిర్మించారు. కానీ ట్యాంకుకు చేరుకునే మెయిన్ పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో మిషన్ భగీరథ నీరు రావడంలేదు. ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చి అందరికీ సమానంగా నీరు వచ్చేలా చూడాలి. - బొజ్జ కుమారస్వామి, రాజంపల్లి నత్తనడకన ట్యాంకు నిర్మాణ పనులు గ్రామంలో ఏసీ, బీసీ కాలనీ వాసులకు మిషన్ భగీరథ పథకంలో తాగునీరందించేందకు నిర్మిస్తున్న ట్యాంకు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులుగాని మిషన్ భగీరథ అధికారులుగాని పట్టించుకోవడంలేదు. దీంతో కాంట్రాక్టరు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడు. - బైరెడ్డి గోవర్దన్‌రెడ్డి , సిర్సనగండ్ల వారం రోజుల్లో అందరికీ నీరు అందేలా చూస్తాం నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు సహకరించడంలేదు. దీంతో పనుల్లో జాప్యం నెలకొంది. పనుల వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల్లో అందరికీ గోదావరి జలాలు నల్లాల ద్వారా సరఫరా అయ్యేలా చూస్తాం. - ప్రవీణ్‌కుమార్, మిషన్ భగీరథ మండల ఏఈ -
ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డగింత
కొండపాక: మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నాయకులను ఎవ్వరినీ ఆ గ్రామానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసుల లాఠీచార్జిలో ఎర్రవల్లికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రజలను పరామర్శించడానికి బయలు దేరి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అడ్డుకున్నారు. రాజీవ్‌రహదారిపై ఉన్న మంగోల్ గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద తొగుట సీఐ రామాంజనేయులు, కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డిలతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. ఈక్రమంలో ప్రజా తెలంగాణా వ్యవస్థాపక అధ్యక్షులురాలు విమలక్కను పోలీసులు అడుడ్కొని తొగుట సర్కిల్లోని బేగంపేట పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో సీపీఐ పార్టీ ఎమ్మెల్యే చాడ వెంకటర్‌రెడ్డిని సైతం అడ్డుకొని గజ్వేల్ పోలీస్టేషన్‌కు తరలించారు. వారిని ఉదయం నుంచిసా యంత్రంవరకు పోలీస్టేషన్లో ఉంచుకొని వదిలివేశారు. -
కారు–బైక్ ఢీ: ఒకరికి తీవ్రగాయాలు
కొండపాక: రాజీవ్ రహదారిపై కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక చౌరస్తా వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి కథనం ప్రకారం... తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఎల్లు నర్సింహారెడ్డి దుద్దెడ నుంచి కొండపాకకు వెళ్లేందుకు రాజీవ్ రహదారిపై ఉన్న కొండపాక క్రాస్ రోడ్డు వద్ద మలుపు వద్ద ఉన్నాడు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ఉన్న నర్సింహారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐతెలిపారు. -
'రైతు ఆత్మహత్యలకు కారణం వారే'
కొండపాక (మెదక్) : తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలన పుణ్యమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో కాలువల ద్వారా సాగు నీటి రంగానికి చుక్క నీరు రాని జిల్లా కేవలం మెదక్ మాత్రమేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి గోదావరి జలాలతో వ్యవసాయ రంగానికి సాగు నీరు, తాగు నీరు అందించే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కొండపాక (మెదక్) : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొండపాక మండలంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వారు కారులో కరీంనగర్‌కు వెళుతుండగా మెదక్ జిల్లా కొండపాక వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దళితుల భూములు అమ్మినా, కొన్నా నేరమే
కొండపాక: నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసే భూములు అమ్మినా, కొన్నా చట్టరీత్యా నేరమని జేసీ శరత్ హెచ్చరించారు. కొండపాక మండలం బందారం గ్రామంలో దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం కింద కొనుగోలు చేయనున్న భూములను ఆయన సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. 15 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న 44 ఎకరాల స్థలంలో కంప చెట్ల తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములను సాగు చేసుకొని బతుకులు బాగుచేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు బోర్లు తవ్వి, కరెంట్ సరఫరా చేస్తామన్నారు. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేస్తామన్నారు. సాగు యోగ్యమైన సాగు భూమినే దళితులకు పంపిణీ చేస్తామని శరత్ పేర్కొన్నారు. పంపిణీ కోసం కొనుగోలు చేయనున్న భూమిపై లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. భూమిని పంపిణీ చేయడానికి ముందే ముళ్లపొదలు తొలగించి ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతుల పద్మానరేందర్, తహశీల్దార్ పరమేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య, ఎగుర్ల వెంకటేశం, గొట్టె ఐలయ్య, ఆర్ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
దళితులకు సాగు భూమి పంపిణీ
కొండపాక: నిరుపేదలైన దళితులకు వ్యవసాయ యోగ్యమైన సాగుభూమిని పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీలో భాగంగా ఆయన ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి కొండపాక మండలం బందారంలోని భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. భూముల ధరలపై నేతలను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పంపిణీ కోసం కొనుగోలు చేయనున్న భూమి సారవంతైమైనదేనా, లబ్ధిదారులు సం తృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించారు. భూ మి పంపిణీ చేయడానికి ముందే ముళ్లపొదలను తొలగించి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మానరేందర్, తహశీల్దార్ పరమేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల అధికారుల ఆకస్మిక దాడులు
కొండపాక, న్యూస్‌లైన్ : రికార్డులు, స్టాకుల్లో తేడా ఉండడంతో మండలంలోని దుద్దెడ శివారులో గల సురభి రైస్ మిల్లును శుక్రవారం జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) బీ ఏసురత్నం సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ విలేకరులతో మాట్లాడారు. మిల్లు రిజిస్టర్లో నమోదైన 25 వందల వడ్లను నిబంధనలకు విరుద్ధంగా గురువారం ఒక రోజే మిల్లు నిర్వాహకులు అమ్ముకున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. లెక్క ప్రకారం ఇందులో 70 శాతం లేవీ బియ్యం ఇవ్వాల్సి ఉందన్నారు. 2013 - 14 సంవత్సరం ఖరీఫ్‌లో 12 వేల క్వింటాళ్ల బియ్యం లేవీ ప్రభుత్వానికి ఇవ్వాలన్న టార్గెట్ ఉండగా ఇందులో కేవలం 1,090 క్వింటాళ్ల మాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 2,643 కింటాళ్ల ధాన్యాన్ని మిల్లు ఆడించి 1,770 క్వింటాళ్ల బియ్యం పౌరసరఫరాల విభాగానికి అప్పగించాల్సి ఉంది. అయితే అందులో 810 కింటాళ్లు మాత్రమే ఇచ్చారని, మిగతా 960 క్వింటాళ్ల బియ్యం బకాయి ఉన్నారని డీఎస్ఓ ఏసురత్నం వివరించారు. మిల్లు ఆడించడానికి తాము అప్పగించిన ధాన్యం స్టాక్‌కు, రికార్డులకు పొంతన లేదన్నారు. రికార్డుల ప్రకారం మిల్లులో 610 క్వింటాళ్ల బియ్యం నిలువ ఉండాలని, సుమారు 500 క్వింటాళ్లు మాత్రమే లెక్క తేలిందన్నారు. నిర్వాహకులు రికార్డులు సరిగా నిర్వహించడం లేదన్నారు. రికార్డులను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నామని, మిల్లును కూడా సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట,సంగారెడ్డి డివిజన్ల ఏఎస్ఓలు తాటి వెంకటేశం, మోహన్‌బాబు, ఆర్ఐ నీలిమ, వీఆర్ఓ శ్రీధర్‌లున్నారు. -
ర్యాగింగ్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం
కొండపాక, న్యూస్‌లైన్ : మండలంలోని వెలికట్ట శివారులో గల ఫార్మసీ కళాశాల సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారని బీజేపీ, టీఆర్ఎస్వీ నేతలు శనివారం కళాశాల ప్రిన్స్‌పాల్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె కుమార్ యాదవ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాట రమేష్‌ల ఆధ్వర్యంలో పలువురు యువకులు కళాశాలకు రావడంతో క ళాశాల సిబ్బంది గేట్లు మూసేశారు. దీంతో ఆగ్రహించిన సం ఘాల నేతలు కళాశాల వద్ద ఉన్న బెం చీలను కిందకు పడేయడంతో సిబ్బంది గేటు తీశారు. లోపలికి వెళ్లిన సంఘాల నాయకులు ప్రిన్స్‌పాల్ కార్తికేయన్‌ను కలిసి నిలదీశారు. కళాశాల సమీపంలో ఉన్న వెలికట్ట చౌరస్తా వద్ద తరచూ సీ నియర్ విద్యార్థుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. ర్యాగి ంగ్‌తో విద్యార్థులు ఆత్మహత్యలకు పా ల్పడితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ర్యాగింగ్‌ను పూర్తిస్థాయిలో అరికట్టాలనీ లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కళాశాల ప్రిన్స్‌పాల్ కా ర్తికేయన్ స్పందిస్తూ తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ర్యాగింగ్‌ను నిరోధించడానికి కాలేజీలో కమిటీ ఉందని చెప్పారు. ఇందుకు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్లకు భయపడి జూనియర్లు ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. కమిటీ ఏం చేస్తుందనీ, ర్యాగింగ్‌ను నిరోధించకపోతే తీవ్ర పరి ణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు వెనుతిరిగారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరెపల్లి లింగం, వడ్లకొండ శ్రీహరి, పంజ కుమార్, కాట మల్లేశంలతో పాటు దుద్దెడకు చెందిన యువకులు పాల్గొన్నారు.