
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా అత్తింటిపై అల్లుడు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు. బామ్మర్దిపై కోపంతో అతనిపై కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో అతని భార్య విమలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు (ఐదుగురు) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అతని భార్య విమల, ఇద్దరు కుమార్తెలు, బావమరిది రాజు, మరదలు సునీత తీవ్రంగా గాయపడ్డారు.
కాగా విమలకు లక్ష్మీరాజంతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైందని, కొంత కాలం తరువాత వారి మధ్య విభేదాలు వచ్చినట్టు స్థానికులు బెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమల రెండేళ్ల నుంచి తల్లి ఇంటి వద్దే ఉంటోదని, భార్యపై కోపంతోనే ఆమె కుంటుంబ సభ్యులను హతమార్చాలని ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment