ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డగింత
కొండపాక: మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నాయకులను ఎవ్వరినీ ఆ గ్రామానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసుల లాఠీచార్జిలో ఎర్రవల్లికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రజలను పరామర్శించడానికి బయలు దేరి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అడ్డుకున్నారు. రాజీవ్‌రహదారిపై ఉన్న మంగోల్ గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద తొగుట సీఐ రామాంజనేయులు, కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డిలతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. ఈక్రమంలో ప్రజా తెలంగాణా వ్యవస్థాపక అధ్యక్షులురాలు విమలక్కను పోలీసులు అడుడ్కొని తొగుట సర్కిల్‌లోని బేగంపేట పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో సీపీఐ పార్టీ ఎమ్మెల్యే చాడ వెంకటర్‌రెడ్డిని సైతం అడ్డుకొని గజ్వేల్ పోలీస్టేషన్‌కు తరలించారు. వారిని ఉదయం నుంచిసా యంత్రంవరకు పోలీస్టేషన్‌లో ఉంచుకొని వదిలివేశారు.