కారు-లారీ ఢీ, ఇద్దరి మృతి
Published Fri, Dec 2 2016 8:35 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
మెదక్: జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరోకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు.
స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement