మత్తడి పారుతున్న సిర్సనగండ్ల గ్రామ ఊరచెరువు
కొండపాక: కొండపాక మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసింది. 38.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసిల్దార్ విజయ్‌భాస్కర్‌జీ తెలిపారు. మండలంలోని సిర్సనగండ్ల, గిరాయిపల్లి, దమ్మక్కపల్లి, కొండపాక, వెలికట్ట, జప్తినాచారం గ్రామాల్లోని చెరువులు మరోసారి అలుగుపారాయి. 20 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు చెరువులు అలుగులు పారడంతో రైతులు సంబరపడుతున్నారు.