Brundavanamadi Andaridi
-
‘బృందావనమది అందరిది’ మూవీ స్టిల్స్
-
బృందావనంకి ఫోర్ పిల్లర్స్
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ ఆశీస్సులతో శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (యన్.అర్.ఐ ) నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రంలోని నటీనటుల వివరాలను చిత్రబృందం వెల్లడించింది. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘నా కథకి కొత్తవాళ్లతో సినిమా చేయాలని నిర్వహించిన ఆడిషన్స్‌కి మంచి స్పందన వచ్చింది. నలుగురు ప్రధాన తారాగణం మినహా మిగిలిన పాత్రలకు చాలామంది కొత్తవాళ్లని తీసుకున్నాం. ప్రధాన తారాగణంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు, నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), సీరత్ కపూర్ (రన్ రాజా రన్ ఫేమ్), థర్టీ ఇయర్స్ పృ«థ్వీ నటిస్తారు. వీరు నలుగురూ నా సినిమాకి మెయిన్ పిల్లర్స్. సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. జనవరి 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘అదుర్స్’ రఘు, బొడ్డ నారాయణ, ‘సత్యం’ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: సి. రాంప్రసాద్. -
టైటిల్ కంటే అందంగా...
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. ‘జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్’ పతాకంపై శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కెమెరామెన్ సి. రాంప్రసాద్ స్విచ్చాన్ చేయగా, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘బృందావనమది అందరిది’ టైటిల్ ఎంత అందంగా ఉందో... సినిమాని అంతకంటే అందంగా తెరకెక్కిస్తాం. మణిశర్మగారిచ్చిన ట్యూన్స్‌తో హ్యాపీగా ఉన్నాం. డిసెంబర్ 20న కేరళలో పాటల చిత్రీకరణతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సహ నిర్మాత : రామిరెడ్డి. -
బృందావనంలో కొత్తవాళ్లు!
‘బృందావనమది అందరిది’ చిత్రంతో తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతున్నారు. అంతా కొత్త నటీనటులతో తీయనున్న ఈ సినిమా గురించి శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా మారడం ఆనందంగా ఉంది. రచయితగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు దర్శకుడిగానూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జంధ్యాలగారిలా అందరూ నవ్వుకునే సినిమాలు తీయాలనుకుంటున్నాను. అందుకే కమర్షియల్ కథలు ఉన్నా అవన్నీ పక్కనపెట్టి ఈ వినోదాత్మక కథను ఎంచుకున్నాను. వినోదాత్మకంగా ఉంటూనే మనలోని బంధాలను గుర్తు చేసేలా ఉంటుందీ సిన్మా. కథ, ఫైట్లు, పాటలు ఉండే సాధరణ చిత్రంలా ఉండదు. ఈ సినిమాతో దర్శకుడిగా నాకో మార్క్ తెచ్చుకోవాలనుకుంటున్నాను’’అన్నారు.