![Brundavanamadi andaridi movie pooja cermony started - Sakshi - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/27/bru.jpg.webp?itok=y7RwJavP)
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. ‘జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్’ పతాకంపై శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కెమెరామెన్ సి. రాంప్రసాద్ స్విచ్చాన్ చేయగా, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘బృందావనమది అందరిది’ టైటిల్ ఎంత అందంగా ఉందో... సినిమాని అంతకంటే అందంగా తెరకెక్కిస్తాం. మణిశర్మగారిచ్చిన ట్యూన్స్‌తో హ్యాపీగా ఉన్నాం. డిసెంబర్ 20న కేరళలో పాటల చిత్రీకరణతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సహ నిర్మాత : రామిరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment