తమిళసినిమా: సైకో థ్రిల్లర్ కథా చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయినప్పటికీ ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తూ నే ఉంటుంది. ఆ తరహాలో రూపొందుతున్న మరో చిత్రం ఇరవిల్ విళిగల్. జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత రీమా రే ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈమె బంగారా అనే కన్నడ చిత్రంలో నటించడానికి గానూ ఉత్తమ కథానాయకి అవార్డును పొందారు. దర్శకుడు సిక్కల్ రాజేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నిళల్ గల్ రవి, మస్కార అస్మిత, కుందాజ్, చరణ్ రాజ్, సిజర్ మనోహర్, ఈశ్వర్ చంద్రబాబు,కిళి రామచంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిక్కల్ రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది సైకో థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. సైకోగా మారడానికి ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తి గత కారణం ఉంటుందని, అలా ఈ చిత్రంలో ఒక వ్యక్తి సైకోగా మారడానికి సమాజంపై కోపం, ఒక విషయం కారణం అవుతాయన్నారు. అవేమిటన్న విషయాన్ని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇదన్నారు.
చిత్ర షూటింగ్‌ను అధిక భాగం ఏర్కాడు సమీపంలోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహించినట్లు చెప్పారు. కొంత భాగాన్ని పాండిచ్చేరి, మరక్కాణం పరిసర ప్రాంతాలలో చిత్రీకరించి మొత్తం 50 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి ఎంఎం.అజార్ సంగీతాన్ని, భాస్కర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment