బాబీ సింహ హీరోగా ‘తడై ఉడై’ సినిమా | Tamil Actor Bobby Simha Next Movie Is Thadai Udai Starts In Chennai | Sakshi
Sakshi News home page

Bobby Simha: చెన్నై ఘనంగా ప్రారంభమైన బాబీ సింహా ‘తడై ఉడై’ చిత్రం

Published Wed, May 4 2022 10:46 AM | Last Updated on Wed, May 4 2022 10:46 AM

Tamil Actor Bobby Simha Next Movie Is Thadai Udai Starts In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: జాతీయ అవార్డు గ్రహీత నటు డు సింహ కథానాయకుడిగా నటిస్తున్న ‘తడై ఉడై’ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటి మిశా నరాంగ్‌ నాయికగా నటిస్తున్న ఇందులో ప్రభు, సెంథిల్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌ఎస్‌ రాజేష్‌ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ముద్రాస్‌ ఫిలిం ఫ్యాక్టరీ, ఆరుద్ర పిక్చర్స్‌ సంస్థల అధినేతలు పి.రాజశేఖర్, రేష్మి సింహా (సింహా భార్య) కలిసి నిర్మిస్తున్నారు.

ఎడ్వెర్ట్‌ ఛాయాగ్రహణంను, ఆదీప్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వైరముత్తు పాటలు రాస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్‌ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. బహుభాషా నటుడు సింహ ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం కావడం, చిత్ర టైటిల్‌ క్యాచీగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ను 5వ తేదీ నుంచి ప్రారంభించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement