రాజుగారు రాగానే... | When Nagarjuna returns Home to Rajagari gadhi-2 shooting start. | Sakshi
Sakshi News home page

రాజుగారు రాగానే...

Published Sun, Jun 25 2017 11:00 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

రాజుగారు రాగానే... - Sakshi

రాజుగారు రాగానే...

రాజుగారు స్వదేశానికి తిరిగి రాగానే సినిమా చిత్రీకరణ పూర్తి చేయడానికి ‘రాజుగారి గది–2’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది.

రాజుగారు   తిరిగి రాగానే సినిమా చిత్రీకరణ పూర్తి చేయడానికి ‘రాజుగారి గది–2’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. రాజుగారు ఎవరంటే... ఇంకెవరు? ‘కింగ్‌’ నాగార్జునే. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారాయన. సమ్మర్‌ హాలిడే ఇంకా పూర్తి చేసుకోలేదు! ఈ నెలాఖరుకి నాగార్జున తిరిగి వచ్చేస్తారు. ఆయన రాగానే ‘రాజుగారి గది–2’ చివరి షెడ్యూల్‌ మొదలు కానుంది.

ఓంకార్‌ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరై్టన్మెంట్, ఓక్‌ ఎంటరై్టన్మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌లో సమంత, సీరత్‌ కపూర్, అశ్విన్, నరేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ ప్రధాన పాత్రధారులు. ఈ చివరి షెడ్యూల్‌లో నాగార్జునతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తీయనున్నారు. వచ్చే నెల రెండో వారం కల్లా చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం. ఇందులో నాగార్జున మెంటలిస్ట్‌ (ఎదుటివ్యక్తి మనస్తత్వం, మనసును చదవగల) పాత్రలో నటిస్తున్నారు. ఈ లుక్‌లా నాగార్జున క్యారెక్టరైజేషన్‌ కూడా అంతే కొత్తగా ఉంటుందట! ఆగస్టులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement