![14 Outfit Ideas for February 14th!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/26.jpg.webp?itok=mNWTkCLh)
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఎంత వరకూ నిజం అనేది అలా ఉంచితే.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది మాత్రం ప్రేమికుల విషయంలో ఎల్లప్పుడూ నిజమవుతూనే ఉంటుంది. అలా మంచి ఇంప్రెషన్ సాధించే విషయంలో టాక్స్ నుంచి లుక్స్ దాకా దేని ప్రాధాన్యతనూ తీసిపారేయలేం. ఈ నేపథ్యంలో పరస్పరం ఇంప్రెస్డ్ అనిపించుకోవాలనే తహతహలాడే ప్రేమికుల కోసం నగరానికి చెందిన హామ్‌స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాక్టరీలు అందిస్తున్న సూచనలివి..
ప్రేమికుల రోజున ధరించడానికి రెడ్ కలర్‌ను మించిన డ్రెస్ మరొకటి ఉండదు. అయితే, ఈ ఏడాది కొంచెం భిన్నంగా ప్రయతి్నంచవచ్చు. లేస్‌తో డిజైన్ చేసిన యాసెంట్స్, రఫ్లెస్ లేదా స్లిట్స్ ఉన్న ఫిగర్–హగ్గింగ్ సిల్హౌట్స్, ఫ్లోయీగా ఉండే మిడి డ్రెస్‌లను ఎంచుకోవచ్చు. టైమ్‌లెస్‌గా, సొగసైన్ లుక్ కోసం స్ట్రాపీ హీల్స్, లైట్ వెయిట్ సింపుల్ జ్యువెలరీని ఈ డ్రెస్‌కు జత చేయవచ్చు.
మేకప్‌కి సాఫ్ట్ బ్లష్ పింక్, మ్యూట్ రోజ్ టోన్స్ రొమాంటిక్ మీట్స్‌కి సరైనవి. మ్యాచింగ్ స్కర్ట్‌లు, శాటిన్ స్లిప్ డ్రెస్‌లు లేదా పేస్టెల్ రంగులలో నిట్‌సెట్‌తో బ్లేజర్లను ఎంచుకోవచ్చు. ఈ షేడ్స్ ఆధునికతకు అద్దం పడతాయి. హృదయాకారపు ఇయర్ హ్యాంగింగ్స్, అందమైన నెక్‌పీస్, చిక్ క్లచ్‌తో లుక్ కంప్లీట్ అవుతుంది. భాగస్వామి హృదయంలో శాశ్వతమైన ముద్ర వేయడానికి ఇష్టమైన పెర్ఫ్యూమ్ జోడించడం మర్చిపోవద్దు
సీక్వెన్స్, మెటాలిక్ ఫాబ్రిక్‌లు ఈ సీజన్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మెరిసే వెండి లేదా బంగారు రంగు దుస్తులు.. వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించే ఈవెనింగ్ పారీ్టలలో లుక్స్‌ని ప్రత్యేకంగా చూపుతాయి.
ఆహ్లాదకరమైన వైబ్ కోసం, హార్ట్ ప్రింట్లు, పోల్కా డాట్స్ లేదా పూల నమూనాలను ప్రయతి్నంచవచ్చు. హై–వెయిస్టెడ్ ప్యాంటు లేదా స్కర్ట్‌తో జత చేసిన హార్ట్–ప్రింటెడ్ బ్లౌజ్ ఫన్నీగా అదే సమయంలో స్టైలిష్ గానూ ఉంటుంది. ప్రత్యామ్నాయంగా, లగ్జరీ టచ్ కోసం వెల్వెట్ ఫర్ వంటి అల్లికలతో ప్రయోగాలు చేయచ్చు.
అబ్బాయిల కోసం..
టైమ్‌లెస్ సూట్: వాలెంటైన్స్‌డే రోజున మ్యాన్లీగా కనిపించడానికి పాలి‹Ù్డ లుక్ కోసం క్లాసిక్ బ్లాక్ లేదా నేవీ సూట్‌ను ఎంచుకోవాలి. రొమాంటిక్ ట్విస్ట్ జోడించాలనుకుంటే, బర్గండి లేదా డార్క్ రెడ్ కలర్ సూట్‌ను ఎంచుకోవచ్చు. ఇది స్టైలి‹Ùగా కనిపించడమే కాదు ఈ సందర్భానికి సరైనది.
స్మార్ట్ క్యాజువల్ వైబ్స్
ముదురు జీన్స్ లేదా చినోస్‌తో క్రిస్పీ వైట్ షర్ట్‌ను జత చేయవచ్చు. మోడర్న్ లుక్ కోసం టైలర్డ్ బ్లేజర్ లేదా స్టైలిష్ లెదర్ జాకెట్‌తో లుక్‌ని పూర్తి చేయవచ్చు. ఈ లుక్ క్యాజువల్ డిన్నర్ లేదా డే టైమ్ డేట్‌కి అనువైనది.
మోనోక్రోమాటిక్ మ్యాజిక్
ఈ సంవత్సరం మోనోక్రోమ్ దుస్తులు ఒక భారీ ట్రెండ్. విభిన్న టెక్స్చర్‌లతో ఆల్–బ్లాక్ ఎన్సెంబుల్‌ను ప్రయతి్నంచండి. బ్లాక్ టర్టిల్‌నెక్, టైలర్డ్ ట్రౌజర్లు, సొగసైన లెదర్ షూలు ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా, మృదువైన, ఆధునిక లుక్ కోసం బూడిద లేదా లేత గోధుమ రంగు షేడ్స్ ఎంపిక చేసుకోండి.
ప్యాటర్న్‌లు, టెక్స్చర్‌లతో ఆడుకోవచ్చు. చారలు లేదా పూల ప్రింట్లు వంటి ప్యాటర్డ్ షర్టులతో దుస్తులకు అందమైన లుక్‌ను తీసుకురావచ్చు. ఆ లుక్‌ను సమతుల్యంగా ఉంచడానికి సాలిడ్–కలర్ ప్యాంటుతో జత చేయాలి. ఆత్మవిశ్వాసంతో యాక్సెసరైజ్
స్టైలిష్ వాచ్, లెదర్ బెల్ట్ లేదా పాకెట్ స్క్వేర్‌తో లుక్‌ను బ్రైట్‌గా మార్చేయవచ్చు. సందర్భానికి తగ్గట్టు టై లేదా సాక్స్ వంటి యాక్సెసరీలలో రెడ్ కలర్‌ను జోడించడానికి వెనుకాడవద్దు.
ఇద్దరు కాదు ఒక్కరే.. అనిపించేలా..
భాగస్వామితో కలిసి మ్యాచింగ్ డ్రెస్ ధరించాలని ప్లాన్ చేసుకుంటే.. ఒకేలాంటి దుస్తుల కంటే కాంప్లిమెంటరీ కలర్స్ లేదా థీమ్‌లపై దృష్టి పెట్టడం మంచిది.
ఉదాహరణకు, ఇద్దరిలో ఒకరు రెడ్ కలర్ దుస్తులు ధరిస్తే మరొకరు టై, పాకెట్ స్క్వేర్ లేదా యాక్సెసరీల ద్వారా రెడ్ కలర్‌ను
చేర్చవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment