Candle Lights
-
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
నిశీధి వీధుల్లో అగ్ని నక్షత్రాలు..
రాత్రిళ్లు తారలు కనపడటం సహజం. కాని కోల్‌కతా వీధుల్లో అగ్ని నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. ‘రీక్లయిమ్ ది నైట్’ పేరుతో మహిళలు అనూహ్య సంఖ్యలో రాత్రిళ్లు దివిటీలతో నిరసనలు చేస్తున్నారు. అభయ ఘటన జరిగి నెల అయిన సందర్భంగా సెప్టెంబర్ 8 రాత్రి కోల్‌కతాలోని ఏ కూడలిలో చూసినా దగ్ధ కాగడాలు చేతబూనిన స్త్రీలే. కోల్‌కతాలో సాగుతున్న నిరసనలపై కథనం.‘రాత్రి ఎవరిది?’ ఈ ప్రశ్న పిక్కటిల్లుతోంది కోల్‌కతాలో. ‘రాత్రి మాది కూడా’ అని అక్కడి స్త్రీలు ఎలుగెత్తి నినదిస్తున్నారు. వందల వేల సంఖ్యలో స్త్రీలు రాత్రిళ్లు బయటకు రావడం... కాగడానో, కొవ్వొత్తినో, సెల్‌ఫోన్ లైట్‌నో వెలిగిస్తూ సామూహికంగా నడవడం... ఆ నగరం ఎప్పుడూ ఎరగదు. ఇప్పుడు చూస్తోంది. ‘కోల్‌కతాలో దుర్గాపూజ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుంది. కాని అభయ విషయంలో న్యాయం కోసం స్త్రీలు రోడ్ల మీదకు వస్తున్నారు. పురుషులు కూడా వారికి స΄ోర్ట్ ఇస్తున్నారు’ అంటున్నారు స్త్రీలు.ఎన్నడూ ఎరగని భయంకోల్కతాలో క్రైమ్ రేటు ఉన్నా ఆగస్టు 8 రాత్రి అభయపై జరిగిన అత్యాచారం, హత్యవల్ల నగరం పూర్తిగా భయపడి΄ోతోంది. స్త్రీలు బయటకు రావాలంటేనే సంకోచించే స్థితి ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్నా మెల్లమెల్లగా ఎందుకు బయటకు రాకూడదనే తెగింపు కూడా మొదలయ్యింది. ఆగస్టు 14 అర్ధరాత్రి (స్వాతంత్య్రం వచ్చిన సమయం) రాత్రి భారీస్థాయిలో స్త్రీలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే పార్టీలు ఉసికొల్పడం వల్ల ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. కాని ఆ తర్వాత ఏ పార్టీతో సంబంధం లేని రిమ్‌ఝిమ్ శర్మ అనే సామాజిక కార్యకర్త న్యాయం కోసం నిరసన తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో అర్ధరాత్రి నిరసనలకు పిలుపునిచ్చింది. నెప్టెంబర్ 4న కోల్‌కతా పట్టపగలులా మారింది. వేలాదిగా మహిళలు బయటకు వచ్చారు. ఈసారి వారందరి చేతుల్లో పార్టీల జండాలు కాకుండా త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. ఇది జనం నిరసన. కోల్‌కతా నగరం దిగ్గున వెలిగింది– న్యాయ ఆకాంక్షతో.నెల రోజుల రాత్రిఆగస్టు 8 రాత్రి కోల్‌కతాలోని ఆర్.జి. కార్ ఆస్పత్రిలో ‘అభయ’ అనే జూనియర్ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం, హత్య జరిగి నెల రోజులు అవుతుండటంతో ‘ఇంకా జరగని న్యాయానికి’ నిరసనగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ‘నైట్ ఆఫ్ అభయ’ పేరుతో నిరసనకు సామాజిక కార్యకర్తలు పిలుపునివ్వడంతో కోల్‌కతాతో పాటు ముఖ్యపట్టణాల్లో స్త్రీలు సెప్టెంబర్ 8 (ఆదివారం) రాత్రి వేలాదిగా రోడ్ల మీదకు వచ్చారు. నినాదాలు, పాటలు, కవితలు... రోడ్ల మీద బొమ్మలు వేయడం ఎక్కడ చూసినా చైతన్యజ్వాలలు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ నినాదం మార్మోగి΄ోయింది. సి.బి.ఐ అనునిత్యం ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడం ఆస్పత్రిలోని మూడు గదులను త్రీడి మ్యాపింగ్ ద్వారా విశ్లేషిస్తున్నామని చెప్పడం పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించడం తప్ప అసలు ఏం జరిగిందో దీని వెనుక ఎవరున్నారో తెలుపడం లేదు. అభయ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 9న (నిన్న) విచారణ చేసినా అందులో అటాప్సీ రి΄ోర్టులో కీలకపత్రం లేక΄ోవడాన్ని గుర్తించి నిలదీసింది. అంటే ఈ కేసు అంతు లేకుండా సాగేలా ఉంది.గగుర్పాటు క్షణం‘ఘటన జరిగి నెల రోజులైనా నా కూతురు ఆ క్షణంలో ఎంత తల్లడిల్లి ఉంటుందో గుర్తుకొస్తే నేటికీ గగుర్పాటుకు గురవుతూనే ఉన్నాను’ అని అభయ తల్లి సెప్టెంబర్ 8 రాత్రి నిరసనలో తెలిపింది. మరోవైపు ఆర్.జి. కార్ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు ఆస్పత్రిలోని పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని, íసీసీ కెమెరాలు బిగించలేదని, భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రోడ్లపైకి వస్తున్న మహిళలను అడిగితే ‘దేశంలో పెరిగి΄ోయిన రేప్ కల్చర్‌తో విసిగి΄ోయాం. దీనికి ముగింపు పలకాల్సిందే. అంతవరకూ రోడ్ల మీదకు వస్తూనే ఉంటాం’ అంటున్నారు. ఏ జాగృదావస్థ అయినా ప్రక్షాళనకే దారి తీస్తుంది. ఈ ప్రక్షాళనే ఇప్పుడు కావాల్సింది. -
దీపావళికి కలర్‌పుల్ దీపాలు కావాలా? ఈ వీడియో చూస్తే మీరు ఫిదానే!
Diwali Special Magic Candle lights: దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది. దీపావళి సందర్భంగా నూనె దీపాలతోపాటు, రంగు రంగుల కొవ్వొత్తులతో ఇంటిని అందంగా అలంకరించుకోవడం అలవాటు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో, కలర్‌ఫుల్ క్యాండిల్ లైట్స్‌ను తయారు చేసుకోవాలని భావిస్తున్నారా.మీలాంటి వారికోసమే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇది ట్విటర్లో 40 లక్షలకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది మరింకెందుకు ఆలస్యం.. మీరు మెచ్చే, మీకు నచ్చే అందమైన కాండిల్ లైట్స్ ఎలా తయారు చేసుకోవాలా చూసేయండి మరి. Very cool idea!pic.twitter.com/WjGQL49hTq — Figen (@TheFigen_) October 29, 2023 -
దీపం వెలిగిద్దాం: చినజీయర్ స్వామి
-
కరోనాపై పోరాడుతున్నావా, ప్రేమిస్తున్నావా?
-
కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రజలకు కూడా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌పై పోరాటానికి చిహ్నంగా ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్–5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులను, సెల్‌ఫోన్ లైట్లను వెలిగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ బాధితులకు ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా జనతా కర్ఫ్యూ సందర్భంగా మార్చి 22వ తేదీన ఐదు గంటలకు చప్పట్లు కొట్టాలంటూ మోదీ ఇంతకు ముందు ఇచ్చిన పిలుపు విజయవంతం అవడంతో ఆయన మళ్లీ ఈ కొవ్వొత్తుల సంఘీభావానికి పిలుపునిచ్చారు. చప్పట్లు కొట్టి వైద్యులకు అభినందనలు తెలపడం, రేపు కొవ్వొత్తులు వెలిగించడం రెండు ఆలోచనలు కూడా మనం అరువు తెచ్చుకున్నవే. వైద్యులకు అభినందనల సూచికగా మార్చి 17వ తేదీనే ఫ్రెంచ్ పౌరులు చప్పట్లు కొట్టగా, అంతకుముందు రోజు ఇటలీ ప్రజలు విద్యుత్ దీపాలు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించారు. మార్చి 22న మోదీ పిలుపునకు సానుకూల స్పందన ఎక్కువరాగా, రేపటి ఆదివారం నాటి కొవ్వొత్తుల పిలుపునకు ప్రతికూల స్పందనలు ఎక్కువగా వస్తున్నాయి. (ప్రణాళిక లేకుండా లాక్డౌన్: మొయిలీ) కరోనా వైరస్‌పై కఠోర దీక్షతో పోరాడుతున్న భారత ప్రభుత్వ వైద్యులకు, వారి సిబ్బంది గ్లౌజులు, మాస్క్‌లు, కవరాల్ సూట్ల కొరతతో ఇక్కట్లు పడుతుంటే ఆ విషయాన్ని పక్కన పడేసి ప్రపంచ సోషల్ మీడియాను ఫాలోఅవడం ఏమని ప్రధాన మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించగా, దేశవ్యాప్తంగా ఒక్కసారి విద్యుత్ దీపాలను ఆర్పేయడం వల్ల ‘కరోనా వైద్య సేవలు’ సహా అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడడమే కాకుండా విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ‘నాసా ప్రకారం కరోనా వేడిలో బతకలేదు. 130 క్యాండిల్స్ ఒక దగ్గర విలిగిస్తే 9 డిగ్రీల ఉష్ణోత్ర పెరుగుతుందని ఐఐటీ ప్రొఫెసర్ చెప్పారు. అదే లక్షలాది క్యాండిల్స్ వెలిగితే పర్యవసానంగా కరోనా ఆదివారం 9 గంటలకు మాడి మసై పోతుంది. ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్’ అని ట్విట్టర్ అనికేత్ మిశ్రా స్పందించగా, ‘ఓ కొవ్వొత్తి వెలిగించడం ఓ హాట్‌స్పాట్. అలా 130 కోట్ల కొవ్వొత్తులు వెలిగిస్తే అన్ని హాట్స్పాట్ల వేడిని ఒక్క కరోనానే కాదు, ఏ వైరస్‌ను తట్టుకోదు’ అంటూ వివేక్.....‘కొవ్వొత్తుల వేడికి ఐదు నిమిషాల్లోనే కరోనా చనిపోతుందీ, మోదీ ఎందుకైనా మంచిదని 9 నిమిషాలు ఇచ్చారు’ అంటూ స్వేతా తమదైన శైలిలో ట్విట్టర్లో స్పందించారు. (లాక్డౌన్: గృహ హింస కేసులు రెట్టింపు.. ) ‘కరోనా కట్టడి చేయలేకపోతున్న నిస్సహాయుడివి నీవు. అందుకే చప్పట్లు కొట్టు, క్యాండిల్స్ వెలిగించు’ అంటూ నెహర్ వూ...‘క్యాండిల్ వెలిగింజడానికి నీవు కరోనాపై పోరాడుతున్నావా, ప్రేమిస్తున్నావా?’ అంటూ వీణా వేణుగోపాల్ ట్వీట్లు చేశారు. ‘క్యాండిల్స్ తర్వాత మోదీ రంగోలీ పోటీలకు పిలుపునిస్తారేమో!’ అంటూ డిస్కోర్స్ డ్యాన్సర్ పేరుతో మరొకరు ట్వీట్ చేశారు.