సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రజలకు కూడా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌పై పోరాటానికి చిహ్నంగా ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్–5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులను, సెల్‌ఫోన్ లైట్లను వెలిగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ బాధితులకు ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా జనతా కర్ఫ్యూ సందర్భంగా మార్చి 22వ తేదీన ఐదు గంటలకు చప్పట్లు కొట్టాలంటూ మోదీ ఇంతకు ముందు ఇచ్చిన పిలుపు విజయవంతం అవడంతో ఆయన మళ్లీ ఈ కొవ్వొత్తుల సంఘీభావానికి పిలుపునిచ్చారు.
చప్పట్లు కొట్టి వైద్యులకు అభినందనలు తెలపడం, రేపు కొవ్వొత్తులు వెలిగించడం రెండు ఆలోచనలు కూడా మనం అరువు తెచ్చుకున్నవే. వైద్యులకు అభినందనల సూచికగా మార్చి 17వ తేదీనే ఫ్రెంచ్ పౌరులు చప్పట్లు కొట్టగా, అంతకుముందు రోజు ఇటలీ ప్రజలు విద్యుత్ దీపాలు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించారు. మార్చి 22న మోదీ పిలుపునకు సానుకూల స్పందన ఎక్కువరాగా, రేపటి ఆదివారం నాటి కొవ్వొత్తుల పిలుపునకు ప్రతికూల స్పందనలు ఎక్కువగా వస్తున్నాయి. (ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్: మొయిలీ)
కరోనా వైరస్‌పై కఠోర దీక్షతో పోరాడుతున్న భారత ప్రభుత్వ వైద్యులకు, వారి సిబ్బంది గ్లౌజులు, మాస్క్‌లు, కవరాల్ సూట్ల కొరతతో ఇక్కట్లు పడుతుంటే ఆ విషయాన్ని పక్కన పడేసి ప్రపంచ సోషల్ మీడియాను ఫాలోఅవడం ఏమని ప్రధాన మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించగా, దేశవ్యాప్తంగా ఒక్కసారి విద్యుత్ దీపాలను ఆర్పేయడం వల్ల ‘కరోనా వైద్య సేవలు’ సహా అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడడమే కాకుండా విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.
‘నాసా ప్రకారం కరోనా వేడిలో బతకలేదు. 130 క్యాండిల్స్ ఒక దగ్గర విలిగిస్తే 9 డిగ్రీల ఉష్ణోత్ర పెరుగుతుందని ఐఐటీ ప్రొఫెసర్ చెప్పారు. అదే లక్షలాది క్యాండిల్స్ వెలిగితే పర్యవసానంగా కరోనా ఆదివారం 9 గంటలకు మాడి మసై పోతుంది. ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్’ అని ట్విట్టర్ అనికేత్ మిశ్రా స్పందించగా, ‘ఓ కొవ్వొత్తి వెలిగించడం ఓ హాట్‌స్పాట్. అలా 130 కోట్ల కొవ్వొత్తులు వెలిగిస్తే అన్ని హాట్‌స్పాట్‌ల వేడిని ఒక్క కరోనానే కాదు, ఏ వైరస్‌ను తట్టుకోదు’ అంటూ వివేక్.....‘కొవ్వొత్తుల వేడికి ఐదు నిమిషాల్లోనే కరోనా చనిపోతుందీ, మోదీ ఎందుకైనా మంచిదని 9 నిమిషాలు ఇచ్చారు’ అంటూ స్వేతా తమదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించారు. (లాక్‌డౌన్: గృహ హింస కేసులు రెట్టింపు.. )
‘కరోనా కట్టడి చేయలేకపోతున్న నిస్సహాయుడివి నీవు. అందుకే చప్పట్లు కొట్టు, క్యాండిల్స్ వెలిగించు’ అంటూ నెహర్ వూ...‘క్యాండిల్ వెలిగింజడానికి నీవు కరోనాపై పోరాడుతున్నావా, ప్రేమిస్తున్నావా?’ అంటూ వీణా వేణుగోపాల్ ట్వీట్లు చేశారు. ‘క్యాండిల్స్ తర్వాత మోదీ రంగోలీ పోటీలకు పిలుపునిస్తారేమో!’ అంటూ డిస్కోర్స్ డ్యాన్సర్ పేరుతో మరొకరు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment