స్మార్ట్ ఫోన్ల ఒరవడి పెరిగిన తర్వాత ప్రతి విషయం జనాన్ని భయపెడుతున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్లు వస్తాయని, బుద్ధిమాంద్యం సంక్రమిస్తుందంటూ కొందరు వైద్య పరమైన సమస్యలను వెల్లడిస్తుంటే... మరి కొందరు ఫోన్ మాట్లాడేందుకు, టెక్ట్స్ సంభాషణలకు కొన్ని సమయాలు మాత్రమే అనుకూలం అని చెప్తుంటారు. అయితే ఫోన్ సంభాషణలకు, టెక్స్ ఛాటింగ్ కు రాత్రి భోజన సమయం మంచిదేనంటున్నారు తాజా అధ్యయనకారులు.
రాత్రి భోజన సమయంలో ఫోన్ మాట్లాడ్డం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు. బంధువులు, చుట్టాలనుంచి కాల్స్ వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేస్తుండగా ఫోన్ వాడకం మంచిది కాదనే విషయంపై పరిశోధనలు నిర్వహించిన మిచిగన్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి మోసర్.. భోజనం చేస్తూ కాండీక్రష్ వంటి గేమ్స్ ఆడటం, ఫేస్ బుక్ లో వచ్చిన వీడియోలు చూడటం వంటివి భిన్నమైనా... ఛాటింగ్, కాల్స్ వంటివి సమస్యలు తెస్తాయన్నది బూటకం అని తేల్చి చెప్పారు.
ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని సుమారు 8 నుంచి 88 ఏళ్ళ మధ్య వయసున్న 1,163 మంది పై పరిశోధనలు నిర్వహించారు. భోజన సమయంలో మొబైల్ వాడేవారి ఆలోచనలపై సర్వే నిర్వహించారు. వారు పనిచేసే రంగాన్నిబట్టి వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉండటాన్ని గమనించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో ఎక్కువ సమయం పట్టొచ్చని, భోజన సమయంలో మెసేజింగ్, ఫోన్ కాల్స్ చేయడంవల్ల పెద్దగా నష్టం ఉండదని తేల్చి చెప్పారు. చిన్నపిల్లలు ఎక్కువగా వారి మిత్రులతో సంభాషిస్తుంటారని, అదీ పగటి సమయంలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేల్లో గమనించిన అధ్యయనకారులు... ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో మధ్య వయస్కులే ఎక్కువగా ఫోన్ వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో వారికి పెద్దగా నష్టం కలగదని తెలుసుకున్నారు. సాధారణంగా భోజన సమయంలో వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం, టీవీలు చూడటం పై ఎన్నో ఏళ్ళక్రితమే పరిశోధనలు జరిగాయని, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కొత్త సవాలుగా మారిందని సహ పరిశోధకురాలు, ప్రొఫెసర్ సరితా ఛోయెనెబెక్ తెలిపారు. ఫోన్ వాడే సమయంలో అర్జెంట్ కాల్స్ ను, మెయిల్స్ ను కూడ పట్టించుకుంటారో లేదో చెప్పలేమన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అభివృద్ధి పరిచేవారు మాత్రం పరికరాల్లో మరింత విజిబులిటీ పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
డిన్నర్ సమయంలో ఒకే..!
Published Wed, May 11 2016 2:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement
Advertisement