Ok
-
డిన్నర్ సమయంలో ఒకే..!
స్మార్ట్ ఫోన్ల ఒరవడి పెరిగిన తర్వాత ప్రతి విషయం జనాన్ని భయపెడుతున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్లు వస్తాయని, బుద్ధిమాంద్యం సంక్రమిస్తుందంటూ కొందరు వైద్య పరమైన సమస్యలను వెల్లడిస్తుంటే... మరి కొందరు ఫోన్ మాట్లాడేందుకు, టెక్ట్స్ సంభాషణలకు కొన్ని సమయాలు మాత్రమే అనుకూలం అని చెప్తుంటారు. అయితే ఫోన్ సంభాషణలకు, టెక్స్ ఛాటింగ్ కు రాత్రి భోజన సమయం మంచిదేనంటున్నారు తాజా అధ్యయనకారులు. రాత్రి భోజన సమయంలో ఫోన్ మాట్లాడ్డం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు. బంధువులు, చుట్టాలనుంచి కాల్స్ వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేస్తుండగా ఫోన్ వాడకం మంచిది కాదనే విషయంపై పరిశోధనలు నిర్వహించిన మిచిగన్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి మోసర్.. భోజనం చేస్తూ కాండీక్రష్ వంటి గేమ్స్ ఆడటం, ఫేస్ బుక్ లో వచ్చిన వీడియోలు చూడటం వంటివి భిన్నమైనా... ఛాటింగ్, కాల్స్ వంటివి సమస్యలు తెస్తాయన్నది బూటకం అని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని సుమారు 8 నుంచి 88 ఏళ్ళ మధ్య వయసున్న 1,163 మంది పై పరిశోధనలు నిర్వహించారు. భోజన సమయంలో మొబైల్ వాడేవారి ఆలోచనలపై సర్వే నిర్వహించారు. వారు పనిచేసే రంగాన్నిబట్టి వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉండటాన్ని గమనించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో ఎక్కువ సమయం పట్టొచ్చని, భోజన సమయంలో మెసేజింగ్, ఫోన్ కాల్స్ చేయడంవల్ల పెద్దగా నష్టం ఉండదని తేల్చి చెప్పారు. చిన్నపిల్లలు ఎక్కువగా వారి మిత్రులతో సంభాషిస్తుంటారని, అదీ పగటి సమయంలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేల్లో గమనించిన అధ్యయనకారులు... ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో మధ్య వయస్కులే ఎక్కువగా ఫోన్ వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో వారికి పెద్దగా నష్టం కలగదని తెలుసుకున్నారు. సాధారణంగా భోజన సమయంలో వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం, టీవీలు చూడటం పై ఎన్నో ఏళ్ళక్రితమే పరిశోధనలు జరిగాయని, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కొత్త సవాలుగా మారిందని సహ పరిశోధకురాలు, ప్రొఫెసర్ సరితా ఛోయెనెబెక్ తెలిపారు. ఫోన్ వాడే సమయంలో అర్జెంట్ కాల్స్ ను, మెయిల్స్ ను కూడ పట్టించుకుంటారో లేదో చెప్పలేమన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అభివృద్ధి పరిచేవారు మాత్రం పరికరాల్లో మరింత విజిబులిటీ పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
'OK' కి ఎన్నేళ్లో తెలుసా?
మనం రోజు విరివిగా వాడే పదం 'ఓకే (OK)'. భాషలకు అతీతంగా ఈ చిన్నపదం స్థిరపడిపోయింది. కానీ ఆ చిన్న పదం పుట్టుక వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. 1839 మార్చి 23 న బోస్టన్ మార్నింగ్ పోస్ట్ పత్రికలో అలన్ మెట్ కాఫ్ అనే వ్యక్తి గ్రామర్ గురించి ఓ వ్యంగ్య వ్యాసం రాశారు. అందులో అన్ని కరెక్టు ( ALL CORRECT) అనే పదానికి బదులు (OLL KORRECT) అని రాసి దాన్ని కుదించి OK గా ప్రచురించారు. అయితే స్పెల్లింగ్ ఫన్నీగా ఉండటంతో అది పలువురిని ఆకర్షించింది. వెంటనే మూడు రోజుల తర్వాత అదే పత్రికలో మరోసారి 'OK' ప్రచురితమైంది. అలా ఆ ఏడాది చివరికి 'ఓకే' ప్రజలకు కొంచెం అలవాటైంది. అయితే, ఓకే కి అసలు సిసలైన ప్రచారం వచ్చింది మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే. 1840 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మార్టిన్ వాన్ బ్యూరెన్ పోటీ పడ్డారు. ఆయనకు ఓల్డ్ కిండర్ హుక్( old kinderhook) అనే నిక్ నేమ్ ఉండేది. ఆయన మద్దతుదారులు ఆ నిక్ నేమ్ ను షార్ట్ కట్ చేసి పలు చోట్ల O.K. క్లబ్స్ ను ఏర్పాటు చేశారు. దాంతో ఆ పదం ఫుల్ గా పాపులర్ అయిపోయింది. అయితే ఈ దశలో ఓకే సృష్టి కర్త మెట్ కాఫ్ ..OK కి రెండు అర్థాలున్నాయని, ' ఓల్డ్ కిండర్ హుక్ వజ్ ఆల్ కరెక్ట్' అంటూ బోస్టన్ మార్నింగ్ పోస్ట్ లో రాసిన ఓ వ్యాసంలో ప్రస్తావించారు. ఇలా ఓకే కు ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో బ్యూరెన్ ప్రత్యర్థి అయిన విలియం హెన్నీ హారిసన్ సపోర్టర్స్ కూడా ఓకే ను వాడటం మొదలు పెట్టారు. అయితే బ్యూరెన్ ను ఇరుకన పెట్టే విధంగా వారు దానిని ఉపయోగించుకున్నారు. బ్యూరెన్ కు ముందు అధ్యక్షుడిగా ఉన్న ఆండ్రూ జాక్సన్ కు అసలు స్పెల్లింగ్స్ రావని, ఆయన ఆమోదించాల్సిన ఫైల్స్ పై ' ALL CORRECT' బదులు 'OLE KORRECK' ను కుదించి O.K. అని రాసేవారని ప్రచారం చేశారు. అది విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోయి..చివరకు ఆ ఎన్నికల్లో విలియం హెన్రీ నే విజయం వరించింది. అలా ఓకే అనే రెండు అక్షరాలతో హెన్రీ తన గెలుపును OK చేసుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో భాషలకు అతీతంగా OK బాగా స్థిరపడిపోయింది. అయితే, ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. 1830 నాటికి వాడుకలో ఉన్న 'ఓర్ల్ కరెక్ట్' అనే పదం నుంచి 'ఓకే' ఆవిర్భవించి ఉంటుందని చెబుతోంది. కానీ సోషల్ మీడియా షార్ట్ కట్ చాటింగ్ ప్రపంచంలో ఇప్పుడేమో మనం OK ని మరింత చిన్నగా చేసి K గా మార్చేస్తున్నాం. ఏదైతేనేం OK పుట్టి ఇప్పటికి 177 సంవత్సరాలై మనందరికి చేరువైంది. -
పోనీ భారత్ అమ్మీ అంటారా?
న్యూ ఢిల్లీః భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని నిరాకరిస్తున్న మజ్లిస్-ఇ-ఇతెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీపై ప్రముఖ నటి షబానా అజ్మి సూటి ప్రశ్నలు సంధించారు. భారత్ మాతా కీ జై అన్న నినాదాన్ని పలకడంలో అభ్యంతరం ఉంటే.... పోనీ భారత్ అమ్మీ అంటారా అంటూ ఒవైసీపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. భర్త జావెద్ అఖ్తర్ అడుగుజాడల్లో నడిచే షబానా.. దేశ రాజధానిలో జరిగిన ఓ సమావేశం సందర్భంలో భారత్ మాతాజీ జై అన్న నినాదాన్ని నిరాకరిస్తున్న ఒవైసీని గురించి ప్రస్తావించారు. ఒవైసీ సాహెబ్ ను నేను ఒక్కటే అడగదల్చుకున్నానని, ఒకవేళ ఆయనకు 'మాతా' అని పలకడంలో అభ్యంతరం ఉంటే 'భారత్ మాతాకీ జై' బదులుగా 'భారత్ అమ్మీకి జై' అంటారా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఓ సందర్భంలో రచయిత, షబానా అజ్మీ భర్త జావేద్ అఖ్తర్... ఒవైసీ నామాన్ని ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టారు. హైదరాబాద్ ఎంపీ అని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆ ఎంపీ భారత్ మాతాకీ జై అని పలకనంటున్నాడని, పైగా రాజ్యాంగంలో లేదంటున్నాడని... అయితే రాజ్యాంగంలో ఆయన్ను టోపీ, షార్వానీ ధరించమని కూడ లేదని అన్నారు. భారత్ మాతాకీ జై అనడం మన విధా, కాదా అన్నది ముఖ్యం కాదని అది మన హక్కు అని మరచిపోకూడదని ఆయన సూచించారు. -
ఐదు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వం రూ.6,050 కోట్ల విలువైన ఐదు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంట్లో రూ.5,000 కోట్ల క్యాడిలా హెల్త్‌కేర్ ప్రతిపాదన కూడా ఉంది. గత నెల 21న జరిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్ఐపీబీ) సూచనల ఆధారంగా ప్రభుత్వం ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా క్విబ్లకు తాజాగా రూ.5,000 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడానికి క్యాడిలా హెల్త్‌కేర్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. -
కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: శామీర్‌పేట ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌కు 15 మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ.. పదవి చేజారి పోతుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శామీర్‌పేటలో 29 ఎంపీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ 15, టీడీపీ 6, టీఆర్ఎస్ 5, బీజేపీ 2, ఒకరు సీపీఐ అభ్యర్థి గెలిచారు. అయితే ఈసారి ఎంపీపీ పీఠం బీసీ జనరల్‌గా రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి మండలంలోని శామీర్‌పేట ఎంపీటీసీ 1 నుంచి వి.సుదర్శన్, 2 నుంచి ఎం.రేణుకమహేందర్ యాదవ్, సునీత (యాంజాల్), బొబ్బిలి మంజుల యాదగిరి (జవహర్‌నగర్- 8)లు, టీడీపీ నుంచి తూంకుంట ఎంపీటీసీ చంద్రశేఖర్‌యాదవ్, అనంతారం నుంచి మల్లేశ్‌గౌడ్‌లు ఎంపీపీ పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా మిగతా ఎంపీటీసీలతో బేరసారాలు చేస్తూ మంతనాలు కొనసాగిస్తున్నారు. శామీర్పేటకే ఎంపీపీ పదవి ఇవ్వాలని కొందరు నాయకులు పట్టుబడుతుండగా, జవహర్‌నగర్‌కు ఇవ్వాలని మరికొందరు నాయకులు పైరవీలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా శామీర్‌పేటకు కేటాయించినందున ఎంపీపీ పదవిని జవహర్‌నగర్‌కే కేటాయించాలని ఎంపీటీసీ సభ్యురాలు మంజుల పట్టుపడుతున్నారు. ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ జవహర్‌నగర్ ఎంపీటీసీ రంగుల సతీష్ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా జవహర్‌నగర్ గ్రామ టీఆర్ఎస్ ముఖ్యనాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ 5, టీడీపీ 6, బీజేపీ 2, సీపీఐ 1తో కలుపుకుని 14 మంది ఎంపీటీసీలు అవుతున్నారు. మెజార్టీ కోసం ఇంకొకరిని కాంగ్రెస్ పార్టీ నుంచి తమవైపు తిప్పుకొంటే ఎంపీపీ పీఠం తమకే దక్కుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాల కారణంగా 15 మంది ఎంపీటీసీలు ఏకతాటిపై లేనిపక్షంలో ఎంపీపీ పదవి చేజారే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరు చేజారకుండా నేడో, రేపో ఆ పార్టీ ముఖ్యనాయకులు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులతో సహా క్యాంపునకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.