పెళ్లి భోజనం వికటించి 100 మందికి అస్వస్థత | Over 100 suffer food poisoning at wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి భోజనం వికటించి 100 మందికి అస్వస్థత

Published Fri, Apr 22 2016 8:06 PM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM

Over 100 suffer food poisoning at wedding

ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా) : పెళ్లి భోజనం వికటించి సుమారు వందమంది అస్వస్థతకు గురైన సంఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో శుక్రవారం జరిగింది. తుమ్మలపాలెం గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుమార్తె వివాహాం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

ఈ సందర్భంగా బంధువులు పెళ్ళి విందుకు హాజరయ్యారు. భోజనం చేసిన తరువాత వరుసగా కడుపునొప్పి, వాంతులకు గురయ్యారు. అస్వస్థతకు గురైనవారిని ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కలుషిత ఆహారం వల్లే ఈ సంఘటన జరిగిందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement