పెళ్లి భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్లర్లు తెలిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం తాంగిడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాంగిడి గ్రామానికి చెందిన సందీప్‌కు, సాగ్టీ గ్రామానికి చెందిన మంజుషాతో మంగళవారం వివాహం జరగనుంది.
కాగా సంప్రదాయంలో భాగంగా పెళ్లికి ముందు రోజు పెళ్లికూతురి ఇంట్లో బోనాలు ఏర్పాటు చేశారు. బోనాల కోసం నిన్న వండిన వంటలను ఈరోజు ఉదయం ఆరగించడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి పెళ్లికి వచ్చిన బంధువులంతా అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ప్రస్తుతం 18 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.