లండన్ : నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందుగా డిన్నర్‌ను రాత్రి 9 గంటలలోపు ముగిస్తే బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల ముప్పు ఐదో వంతు తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆహారం తీసుకుంటే శరీరంలో వాపులు ఏర్పడటంతో పాటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతాయని ఇవి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
గతంలో సూర్యాస్తమయానికి ముందే ఆహారం తీసుకునేవారని, నిద్ర పోయే లోపు అది జీర్ణయమయ్యేదని, ప్రసుత్తం ఆధునిక జీవితంలో పొద్దుపోయేవరకూ పనిచేయడం, దూర ప్రాంతం నుంచి ఇంటికి చేరుకోవడంతో ఆలస్యంగా తినడం అలవాటైందని ఇది ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటున్నారు.
రాత్రి 9 గంటలలోపు డిన్నర్ తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. పడుకునే సమయానికి రెండు గంటల ముందు ఆహారం తీసుకుంటే ఈ క్యాన్సర్ల ముప్పు 20 శాతం వరకూ తగ్గుతుందని తెలిపారు.అథ్యయన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment