నీతి ఆయోగ్‌పై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశం కానున్నారు.
హైదరాబాద్: నీతి ఆయోగ్‌పై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశం కానున్నారు. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన నీతి ఆయోగ్ విధివిధానాల రూపకల్పనలో కేంద్రానికి సలహాలు, సూచనలు అందించేందుకు సీఎం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులందరికీ సీఎం విందు ఇవ్వనున్నారు.