ఒబామా చాలా ఫన్నీ: ప్రియాంక
ముంబయి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బాలీవుడ్ నటి.. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా చెప్పింది. వైట్ హౌస్ లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యంలో డిన్నర్ పార్టీకి హాజరైన ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబయింది.
ఒబామా, మిషెల్లీతో కలిసి డిన్నర్ చేయడం ఆనందాన్నిచ్చిందని చెప్పింది. ఒబామా చాలా ఫన్నీ.. అని ఆయన చాలా మంచివారని పొగడ్తల్లో ముంచెత్తుతూ ట్వీట్ చేసింది. 2016 వైట్ హౌస్ కరెస్పాండెట్స్ నిర్వహించిన విందుకు ప్రియాంకను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ హాలీవుడ్ చిత్ర షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు.