ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రతి పది మందిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో చాలామంది బరువు తగ్గేందుకు ఎన్నో పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకునేందుకు డైటింగ్, ఫాస్టింగ్ పద్దతిని ఫాలో అవుతుంటారు.
దీనికోసం డిన్నర్‌ను స్కిప్ చేసి మరుసటిరోజు అల్పాహారం తీసుకుంటున్నారు.కానీ దీనివల్ల బరువు తగ్గడమేమో కానీ అనేక నష్టం జరుగుతుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోటి విద్యలు కూటి కోసమే అన్న సామెత అందిరికి తెలిసిందే. ఎంత సంపాదించినా మూడు పూటల కడుపు నింపుకోవడం కోసమే. కానీ ఈ మధ్య చాలామంది ఉద్యోగాల ఒత్తిడి, సమయం సరిపోక, బరువు పెరుగుతామని రాత్రి భోజనం మానేస్తుంటారు. దీని వల్ల సన్నబడటం సంగతేమో కానీ అనారోగ్య సమస్యలు తప్పవట. రాత్రిపూట తినడం మానేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.
►రాత్రిపూట ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉంటే సరిగా నిద్ర ఉండదట. దీని కారణంగా మరుసటి రోజు అలసట, నీరసంగా అనిపిస్తుంది.
► ఏమీ తినకుండా పడుకుంటే ఆ ప్రభావం బ్రేక్‌ఫాస్ట్‌పై కూడా పుడుతుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల అల్పాహారం ఎక్కువగా తినే ఛాన్స్ ఉంది.
► ఇక బరువు తగ్గుతామని చాలా మంది డిన్నర్ స్కిప్ చేస్తుంటారు. కానీ దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తహీనతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
► భోజనం మానేస్తే మెదడు చికాకు పెట్టేస్తుంది. శరీరం కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆకలి ఎక్కువగా ఉంటుంది.
► భోజనం మానేయడం వల్ల శరీరం ఆకలితో ఉండటం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అధిక కార్టిసాల్ స్థాయిలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.
► రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా రాత్రినిద్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రోగాలు దాడిచేస్తాయి.
► రక్తంలో చక్కెర అసమతుల్యత ఏర్పడి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
► దీర్ఘకాలంగా డిన్నర్ మానేస్తే నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే, శరీరానికి అవసరమైన కేలరీలు, పోషకాలు అందవు.
► నిద్ర సంబంధిత రుగ్మతలతో మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
► న్యూరోసైకియాట్రిక్ డిసీజ్ అండ్ ట్రీట్‌మెంట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం తీవ్రమైన నిద్ర లేమి జ్ఞాపకశక్తి లోపానికి దారితీస్తుందట.
► అందుకే మూడు పూటల తిండి, తగినంద నిద్ర శరీరానికి ఎంతో అవసరం అని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment