
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24వ తేదీ దాకా.. నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఈ నెల 21న మోదీకి ప్రత్యేక విందు ఇస్తారని, ఈ విందులో బైడెన్ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారని సమాచారం.
22న అధికారిక విందు జరుగుతుందని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 22న విందు కంటే ముందు వైట్‌హౌస్ సౌత్ లాన్‌లో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, 21న మోదీకి ప్రత్యేక విందు ఎక్కడ ఇస్తారన్నది ఇంకా తెలియరాలేదు.
‘జూన్ 22న వైట్‌హౌస్ సౌత్ లాన్‌లో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు రోజు రాత్రి మోదీతో బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు కొద్దిసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం చాలా ప్రత్యేకం. ఇద్దరు నేతల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది’ అని తెలిపారు. త్వరలో వైట్‌హౌస్ వర్గాలు అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా.. మోదీ అమెరికా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రవాస భారతీయులు ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంతగడ్డ మీద రష్యా మిసైళ్ళ దాడి
Comments
Please login to add a commentAdd a comment