మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా | Khem Cho Mr PM? Obama asks Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా

Published Tue, Sep 30 2014 8:34 AM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM

మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా - Sakshi

మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేతసౌథంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఒబామా  'కేమ్ చో మిస్టర్ పీఎం?(హౌ ఆర్ యూ)' అంటూ మోడీకి గుజరాతీలో పలకరించారు.  తొలిసారి కలుసుకున్న ఇద్దరు నేతలూ పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు.

మోడీ గౌరవార్ధం ఒబామా వైట్‌హౌస్‌లో విందు  ఇచ్చారు. ఈ విందులో మోడీ, ఒబామాతో పాటు 20మంది ప్రముఖులు పాల్గొన్నారు.  సాయంత్రం మరోసారి ఒబామా, మోడీ భేటీ కానున్నారు.  ఓవల్ హౌస్లో  జరిగే ఈ సమావేశంలో సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. కాగా  శ్వేతసౌధంలో ఇచ్చిన ఈ విందుకు ఒబామా సతీమణి మిషేల్ ఒబామా హాజరు కాలేదు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement