పూర్వం నుంచి రాత్రి భోజనం తర్వాత నాలుగు అడుగులు వేయండి అని మన పెద్దలు తరుచుగా చెబుతుంటారు. భోజనం అయ్యిన వెంటనే పడక మీద వాలిపోవద్దని అంటుంటారు. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయమే చెబుతుంటారు కూడా. అసలు దీని వల్ల ఏం జరుగుతుంది? కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
భారతీయ సంప్రదాయంలో ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు కొందరూ. రాత్రి భోజనం అయ్యిన వెంటేనే కాసేపు ఆరు బయట అలా కబుర్లు చెప్పుకుంటూ నడవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. రాత్రి భోజనం తర్వాత కనీసం ఓ అరగంట నడిస్తే చాలని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. ఇలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటంటే..
రాత్రి భోజనం తర్వాత ఓ 30 నిమిషాల పాటు నడిస్తే మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా ప్రోత్సహిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని నివారించి అజీర్ణాన్ని దరి చేరనియ్యదు. ఇది ప్రేగుల ఆరోగ్యానికి మంచిది కూడా.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ స్పైక్‌లను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. ఇలా నడవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పైగా తేలికపాటి వ్యాయామం శరీరానికి అంది, ఒత్తిడిని దూరం చేస్తుంది.
అలాగే అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇలా నడవడం వల్ల శరీరం మంచి పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.
ఈ నడక వల్ల కుటుంబ సభ్యులతో గడిపే ఒక చక్కటి అవకాశం కూడా దొరుకుతుంది. ఒకరకంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చాలామంది వైద్యులు డిన్నర్ తర్వాత నడక గణనీయమైన ప్రయోజనాలనను పొందగలరని నొక్కి చెబుతున్నారు. ఉదయం వాకింగ్ ఎముకల ఆరోగ్యానికి మంచిదైతే సాయంత్రం భోజనం తర్వాత కొద్దిపాటి నడక జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదే సమయంలో అలాంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు
చేయకూడనవి ఏంటంటే..
అసౌకర్యం లేదా అజీర్తి రాకూడదంటే భారగీ భోజనం చేసినట్లయితే వెంటనే నడవకూదు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు విరామం ఇచ్చి నడిస్తే మంచిది.
వేగంగా కూడా నడవకూడదు. ఇది తిమ్మిర్లు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
డిన్నర్ తర్వాత నడిస్తే కొందరికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటివాళ్లు ఉదయం, సాయంత్రాల్లో నడిచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
అలాగే తేలిక పాటి నడకే మంచిది. ఏదో కేలరీలు బర్న్ అవ్వాలి అన్నంతగా ఆ సమయంలో నడవకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(చదవండి: ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!)
Comments
Please login to add a commentAdd a comment