happen
-
రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఇన్ని లాభాలా..!
పూర్వం నుంచి రాత్రి భోజనం తర్వాత నాలుగు అడుగులు వేయండి అని మన పెద్దలు తరుచుగా చెబుతుంటారు. భోజనం అయ్యిన వెంటనే పడక మీద వాలిపోవద్దని అంటుంటారు. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయమే చెబుతుంటారు కూడా. అసలు దీని వల్ల ఏం జరుగుతుంది? కలిగే ప్రయోజనాలు ఏంటంటే..భారతీయ సంప్రదాయంలో ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు కొందరూ. రాత్రి భోజనం అయ్యిన వెంటేనే కాసేపు ఆరు బయట అలా కబుర్లు చెప్పుకుంటూ నడవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. రాత్రి భోజనం తర్వాత కనీసం ఓ అరగంట నడిస్తే చాలని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. ఇలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటంటే..రాత్రి భోజనం తర్వాత ఓ 30 నిమిషాల పాటు నడిస్తే మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా ప్రోత్సహిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని నివారించి అజీర్ణాన్ని దరి చేరనియ్యదు. ఇది ప్రేగుల ఆరోగ్యానికి మంచిది కూడా. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ స్పైక్‌లను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. ఇలా నడవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పైగా తేలికపాటి వ్యాయామం శరీరానికి అంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇలా నడవడం వల్ల శరీరం మంచి పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ఈ నడక వల్ల కుటుంబ సభ్యులతో గడిపే ఒక చక్కటి అవకాశం కూడా దొరుకుతుంది. ఒకరకంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలామంది వైద్యులు డిన్నర్ తర్వాత నడక గణనీయమైన ప్రయోజనాలనను పొందగలరని నొక్కి చెబుతున్నారు. ఉదయం వాకింగ్ ఎముకల ఆరోగ్యానికి మంచిదైతే సాయంత్రం భోజనం తర్వాత కొద్దిపాటి నడక జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదే సమయంలో అలాంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులుచేయకూడనవి ఏంటంటే..అసౌకర్యం లేదా అజీర్తి రాకూడదంటే భారగీ భోజనం చేసినట్లయితే వెంటనే నడవకూదు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు విరామం ఇచ్చి నడిస్తే మంచిది. వేగంగా కూడా నడవకూడదు. ఇది తిమ్మిర్లు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. డిన్నర్ తర్వాత నడిస్తే కొందరికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటివాళ్లు ఉదయం, సాయంత్రాల్లో నడిచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే తేలిక పాటి నడకే మంచిది. ఏదో కేలరీలు బర్న్ అవ్వాలి అన్నంతగా ఆ సమయంలో నడవకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.(చదవండి: ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!) -
పార్లమెంట్ పాత భవనాన్ని ఏం చేయనున్నారు? 10 పాయింట్లలో పూర్తి వివరాలు..
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. దీంతో ఇప్పుడు దేశంలోని చాలా మంది ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. పాత భవనాన్ని కూల్చివేస్తారా? లేదా మరేదైనా అవసరాలకు ఉపయోగిస్తారా?. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి 2020, డిసెంబరు 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ భవనం అద్భుతంగా ఉండటమే కాకుండా భద్రత కోసం అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. నూతన పార్లమెంట్ భవనం పాత భవనం కంటే చాలా పెద్దది. పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలు కూర్చునే ఏర్పాట్లతో పాటు లైబ్రరీ, లాంజ్, ఛాంబర్ ఉన్నాయి. ఇదేకాకుండా ఎంపీలు, జర్నలిస్టులకు రాయితీ ధరలకు ఆహారం అందించే క్యాంటీన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ చారిత్రక భవనాన్ని ఏం చేయనున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పాత పార్లమెంటు భవనానికి సంబంధించిన ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో 10 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 1) పాత భవనాన్ని 1927లో బ్రిటిష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ నిర్మించారు. ఈ భవనానికి ఇప్పుడు 97 ఏళ్లు నిండాయి. 2) ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాత భవనాన్ని కూల్చివేయరు. ఈ భవనానికి మరమ్మతులు చేసి, కొత్త అవసరాలకు అనుగుణంగా మార్చనున్నారు. 3) లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనాన్ని పునరుద్ధరించనున్నారు. ఇతర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. 4) భారత పార్లమెంటరీ చరిత్రను సామాన్య ప్రజలు తెలుసుకునేలా భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు సమాచారం. 5) ఈ భవనాన్ని భారతదేశపు ముఖ్యమైన చారిత్రక వారసత్వ సంపదగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సంబంధిత అధికారవర్గాలు చెబుతున్నాయి. 6) భవన పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 7) ఈ భవనంలోని నేషనల్ ఆర్కైవ్స్ కొత్త భవనానికి తరలిపోనుంది. దీంతో పాత భవనంలోని ఈ స్థలాన్ని సమావేశ గదిగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు. 8) పార్లమెంట్ కొత్త భవనంలో ఎంపీల కోసం ఛాంబర్, విశ్రాంతి స్థలం, లైబ్రరీ, క్యాంటీన్ వంటి అనేక ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. 9) కొత్త పార్లమెంట్ భవనం 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యింది. ఇందులో లోక్‌సభకు 880 సీట్లు, రాజ్యసభకు 300 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి సమావేశానికి 1280 సీట్లను ఏర్పాటు చేశారు. 10) సౌండ్ సెన్సార్లతో సహా అత్యాధునిక సాంకేతికత కలిగిన కొత్త భవనంలో భద్రత కోసం అనేక లేయర్లు ఉపయోగించారు. ఇది కూడా చదవండి: పాక్ బాంబు దాడికి బలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది? -
డిసెంబర్ 12 వరకు ఊరూరా పెళ్లి సందడి..
-
గుజరాత్ లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
-
ఇండియాలోనే అధికం...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. గర్భం, ప్రసూతి సమయాల్లో ఇండియాలో ప్రతి ఐదు నిమిషాలకు ఓ మహిళ మరణిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం ప్రసూతి మరణాల రేటు తీవ్రంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భం సమయంలో పౌష్టికాహార లోపం, ప్రసవానంతరం రక్తస్రావం వంటి అనేక కారణాలతో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది. గర్భంవల్లో, ప్రసవం సమయంలోనో ప్రతి ఐదు నిమిషాలకు ఓ భారత మహిళ చనిపోతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం సుమారు 5,29,000 ప్రసూతి మరణాలు సంభవిస్తుండగా వాటిలో అత్యధికంగా 25.7 శాతం భారత్ లోనే జరుగుతున్నట్లు లెక్కల ద్వారా కనుగొంది. వీటిలో ముఖ్యంగా ప్రసవానంతరం రక్తస్రావం వల్ల రెండొంతుల మరణాలు సంభవిస్తున్నట్లు డబ్ల్యూ హెచ్ వో తన ప్రకటనలో తెలిపింది. రక్తస్రావం, ప్రసవానంతర హెమరేజ్ (పీపీహెచ్) వల్ల పిల్లలు పుట్టిన 24 గంటల్లోపు 500 నుంచి 1000 మిల్లీ లీటర్ల రక్తం మహిళలు నష్టపోవడంవల్ల మరణాలు ఏర్పడుతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో నిర్వచించింది. భారత్ లో అధికంగా పీపీహెచ్ ఫలితంగానే మహిళల మరణాలు సంభిస్తుండటంతో ప్రసూతి మరణాలు తగ్గించడం, పునరుత్పత్తి, ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉంచడమే ధ్యేయంగా మిలీనియం డెవలప్మెంట్ గోల్ దృష్టి సారించింది. భారతదేశంలో బాలింతల మృతులు పెరుగుతున్న నేపథ్యంలో 2011-13 తాజా అంచనాల ప్రకారం సగటున లక్ష జననాల్లో 167 మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే అస్పాంలో అత్యధికంగా 300 మరణాలు, కేరళలో అతి తక్కువగా 61 మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో ప్రకటనలో తెలిపింది. ప్రతిదేశం కనీసం ఒక శాతం రక్తం రిజర్వ్ లో ఉంచుకోవాల్సి ఉండగా, ముఖ్యంగా ఇండియాలో దీర్ఘకాలిక కొరతవల్ల కూడ ఈ మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూ హెచ్ సూచిస్తోంది. 1,2 బిలియన్ల జనాభా ఉన్న ఇండియాలో సంవత్సరానికి 12 మిలియన్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, కేవలం 9 మిలియన్ల యూనిట్ల రక్తం మాత్రమే సేకరిస్తోంది. దీంతో సుమారు 25 శాతం రక్తం లోటు ఏర్పడుతోంది. భారత దేశంలో ఈ లోటు విషయాన్ని పెద్దగా పట్టించుకోపోవడం, రక్త సేకరణ విషయంలో అశ్రద్ధ వహించడం ఇందుకు కారణాలలౌతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో ప్రకటనలో తెలిపింది. -
దొంగలను పట్టుకోమంటే తప్పా?
-
ఎస్సై స్పందించి ఉంటే హత్య జరిగేదికాదు