బాలయ్య బాబు-బాలీవుడ్‌ భామ@ డిన్నర్‌ | Date night with Balakrishna Garu-kyradutt | Sakshi
Sakshi News home page

బాలయ్య బాబు-బాలీవుడ్‌ భామ@ డిన్నర్‌

Published Fri, Jul 28 2017 8:52 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య బాబు-బాలీవుడ్‌ భామ@ డిన్నర్‌ - Sakshi

బాలయ్య బాబు-బాలీవుడ్‌ భామ@ డిన్నర్‌

పూరి జగన్నాధ్‌ దర్శకత్వం లో బాలకృష్ణ- శ్రేయ- కైరాదత్ కాంబినేషన్‌లో వస్తున్న ఫిల్మ్ ‘పైసా వసూల్’.  ఈ మూవీ  వెరైటీ స్టంపర్‌  శ్రావణమాసం తొలి శుక్రవారం (నేడు)రిలీజ్‌  కానుంది.  దీని కోసం ఒకవైపు అభిమానులు  ఎంతో ఆసక్తిగా ఎదురు  చూస్తుండగా, మరోవైపు ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న  బాలీవుడ్‌  భామ  కైరా ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా  అభిమానులతో  పంచుకున్నారు.  హీరో బాలకృష్ణతో కలిసి డిన్నర్ చేసిన  ఫోటోను  ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.  అంతేకాదు ఈ సందర్భంగా హీరో బాలకృష్టపై ప్రశంసలు కురిపించారు. బాలకృష‍్ణగారు నిజమైన జెంటిల్‌మెన్, మనసు బంగారం అంటూ  అపారమైన ప్రేమను,  శాశ్వతమైన గౌరవాన్ని చాటుకుంటూ  ట్వీట్ చేయడం విశేషం.

కాగా  రెగ్యులర్‌ టీజర్, ట్రైలర్‌లకు భిన్నంగా ఉండే తమ స్టంప్‌కోసం  ఈ నెల 28వ తేదీ వరకు వెయిట్‌ చేయండి అని ఇప్పటికే పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా  షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చారు.. త్వరలోనే   రిలీజ్‌ కానున్న  ఆడియోపై  అభిమానుల్లో భారీ అంచనానే నెలకొన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement