రణ్‌బీర్‌ ఫ్యామిలీతో అలియా డిన్నర్‌ | Alia Bhatt Joins Dinner With Ranbir Family | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌ ఫ్యామిలీతో అలియా డిన్నర్‌

Published Sun, Jun 10 2018 6:00 PM | Last Updated on Sun, Jun 10 2018 6:49 PM

Alia Bhatt Joins Dinner With Ranbir Family - Sakshi

బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ల మధ్య  ప్రేమాయణం హాట్‌ టాఫిక్‌గా మారింది.  గత కొంతకాలంగా వీరిద్దరి బంధానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం రణ్‌బీర్‌ కుటుంబం అలియాను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌, సోదరి రిదిమాలతో అలియాకు సత్సబంధాలే ఉన్నాయి. తాజాగా శనివారం సాయంత్రం రణబీర్‌ కుటుంబంతో కలసి అలియా డిన్నర్‌కు వెళ్లింది. అలియా, రణబీర్‌లతో పాటు నీతూ కపూర్‌, రిదిమా, సమర(రిదిమా కూతురు) కూడా ఉన్నారు. ముంబైలోని సెయింట్‌ రెగిస్‌ హోటల్‌లో వీరు డిన్నర్‌కు హాజరైన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో అలియా సమరతో ముందు నడుస్తుండగా.. రణబీర్‌, నీతూ, రిదిమా వారి వెనుక ఉన్నారు. 

కాగా.. రణ్‌బీర్‌ కపూర్‌ వీరి బంధాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.. ఇప్పుడు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదని తెలిపారు. అలియా మాత్రం తన బిగ్గెస్ట్‌ క్రష్‌ రణ్‌బీర్‌ అని చెప్పినప్పటికీ నేరుగా తమ బంధం గురించి మాత్రం ఎటువంటి కామెంట్లు చేయలేదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సీరియస్‌గానే సాగుతుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. వీరిద్దరు తొలిసారి ‘బ్రహాస్త్ర’ చిత్రంలో కలసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి వీరు ఎక్కడికెళ్లిన అదో వార్తగా మారుతోంది. దీంతో ప్రస్తుతం వీరి పెళ్లిపై అభిమానుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement