Neetu Kapoor Reaction As Alia Bhatt Announces Pregnancy, Video Viral - Sakshi
Sakshi News home page

Neetu Kapoor: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్‌ రియాక్షన్‌ చూశారా!

Published Mon, Jun 27 2022 5:26 PM | Last Updated on Mon, Jun 27 2022 5:47 PM

Neetu Kapoor Reaction After Knows Alia Bhatt Pregnant Post - Sakshi

బాలీవుడ్‌ కొత్త జంట ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ‘మా పాపాయి రాబోతుంది’ అంటూ సోమవారం(జూన్‌ 27) ఉదయం సోషల్‌ మీడియా వేదికగా గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆలియా. దీంతో రణ్‌బీర్‌-ఆలియా దంపతులకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఆలియా ప్రెగ్నెన్సీపై రణ్‌బీర్‌ తల్లి, నటి నీతూ కపూర్‌ స్పందించింది. మూవీ షూటింగ్‌లో ఉన్న నీతూ కపూర్‌కు మీడియా నానమ్మ(దాది) కాబోతున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.

చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్‌, కాజల్‌ టాప్‌

దీనికి ఆమె ‘నేను నానమ్మ కాబోతున్నానని అప్పుడే ఇండియా మొత్తానికి తెలిసిపోయిందా?’ అని అంటుండగా.. ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసినట్లు మీడియా ఆమెతో చెప్పింది. ఇక ఈ విషయం తెలియని నీతూ కపూర్‌ కాస్తా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన రణ్‌బీర్‌-ఆలియాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 14న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. 

చదవండి: Alia Bhatt Ranbir Kapoor: తల్లిదండ్రులు కాబోతున్న అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement