అమిత్‌ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే.. | Amit Shah Hosts Dinner For Padma Awardees, Check Menu Details And Videos Goes Viral | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..

Published Fri, May 10 2024 2:18 PM | Last Updated on Fri, May 10 2024 4:26 PM

Amit Shah Hosts Dinner For Padma Awardees

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ వేడుకలో రెండు పద్మ విభూషణ్‌, 9 పద్మ భూషణ్‌, 56 పద్మశ్రీ పురస్కారాలను ప్రధానం చేశారు. తదనంతరం ఆ గ్రహితలందరికి హోం మంత్రి అమిత్‌ షా నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఎలాంటి వంటకాలు వడ్డించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో చూద్దామా..!

ఈ డిన్నర్‌లో స్వచ్ఛమైన శాకాహార భోజనాన్ని కంచుప్లేట్‌లలో సర్వ్‌ చేయడం విశేషం. ఈ విందులో అమిత్‌ షాకు ఎంతో ఇష్టమైన గుజరాతీ వంటకాలను అతిథులకు సర్వ్‌ చేశారు. వాటిలో సెవ్‌తో ఉండే పోహా, దోక్లా ఖాండ్వీ, హరేభరే కబాబ్‌, కేసరి బాత్‌, మష్రూమ్‌ కబాబ్‌, వెజ్‌ బిర్యానీ, వంటి వంటకాలు ఉన్నాయి. ఇందులో సర్వ్‌ చేసిన గుజరాతీ వంటకం దోక్లాను బేసిన్‌ పిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సూజి, పెరుగు, పసుపు, ఉప్పు, పంచాదర మిశ్రమాలతో తయారు చేస్తారు. 

మరోవైపు కూరగాయాలతో చేసిన హరే భరే కబాబ్ నోరూరిస్తుండగా..పక్కనే పచ్చి కూరగాయాలు, మొలకెత్తిన పప్పు ధాన్యాలను రోస్టెడ్‌, మసాలాల కలయికతో చేసిన సలాడ్‌ కాంబినేషన్‌ అదిరిపోయింది. ఆ తర్వాత అప్పటి వరకు హాట్‌ ఐటెమ్స్‌తో స్పైసీగా ఉన్న నోటిని తియ్యగా చేసేలా అన్నం పంచాదర, నెయ్యి, డ్రైఫ్రూట్‌లతో చేసిన కేసరి భాత్‌ ఆహుతులకు ఆహ్లాదకరమైన రుచిని అందజేసింది. ఇక ఈ డిన్నర్‌లో సర్వ్‌ చేసిన వెజ్‌ బిరియానీ వివిధ రకాల కూరగాయలతో ఘుమాళించే వాసనతో ఆవురావురమని తినేలా హైలెట్‌గా నిలిచింది. 

ఇక చివరిగా వడ్డించిన ఖాండ్వీ కూడా గుజరాతీ సుప్రసిద్ధ వంటకమే. దీన్ని సెనగపిండి పెరుగు మసాలా దినుసుల కలయికతో తయారు చేస్తారు. ఈ ప్రత్యేక విందులో పాల్గొన్న అతిథులంతా గుజరాతి ప్రసిద్ధ వంటకాలను ఎంజాయ్‌ చేశారు. కాగా ఈ డిన్నర్‌ పార్టీకి ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, అవార్డు గ్రహీతలు హాజరయ్యారు. ఈ అతిథుల జాబితాలో మెగా కుటుంబం ప్యామిలితో సహా విచ్చేసి సందడి చేసింది. వీరంతా అమిత్‌ షాతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement