
వాషింగ్టన్: అమెరికా సంగీత ప్రపంచాన్ని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన దిగ్గజ రాక్‌స్టార్ ఎడీ వాన్ హాలెన్ (65) కన్నుమూశారు. ప్రాణాంతక క్యాన్సర్‌తో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న ఆయన ఓటమి చెందారు. తన తండ్రి మరణం తీరని లోటు అని హాలెన్ కుమారుడు వోల్ఫ్ వాన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘చిన్నప్పటినుంచి ప్రేమానురాగాలతో పెంచి పెద్దచేసిన నాన్న అస్తమయం.. జీవిత కాలంలో పూడ్చుకోలేని నష్టం. ఆయనతో గడిపిన ప్రతిక్షణం ఓ అద్భుతమైన బహుమతి. లవ్ యూ డాడీ’అని వోల్ఫ్’ భావోద్వేగ పోస్టు చేశారు.
(చదవండి: హెచ్1 బీ వీసా : టెకీలకు మరో షాక్)
కాగా, వాన్ హాలెన్ నెదర్లాండ్స్‌లో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగారు. తన అన్న అలెక్స్ తోకలిసి 1972లో వాన్ హాలెన్ రాక్ మ్యూజిక్ గ్రూప్‌ని ఏర్పాటు చేశాడు. క్లాసికల్ మ్యూజిక్‌తో అనతికాలంలోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. హాలెన్ రాక్ గ్రూప్ క్లాసిక్ హిట్స్.. ‘రన్నిన్ విత్ ద డెవిల్’.., గిటార్ సోలో ‘ఎరప్షన్’ బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన రాక్ గ్రూప్ స్వరపర్చిన దాదాపు 75 మిలియన్ల ఆల్బమ్‌లు అమ్ముడుపోవడం విశేషం. యూఎస్ చరిత్రలోనే ఇంత భారీ స్థాయి ఆదరణ మరో రాక్ మ్యూజిక్ గ్రూప్ సాధించలేదు. వాన్ హాలన్ అసలు పేరు ఎడ్వర్డ్ లూయీస్ కాగా.. మ్యూజిక్ గ్రూప్ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు.
(చదవండి: అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!)
Comments
Please login to add a commentAdd a comment