ట్రంప్‌ను తిట్టడం మాత్రం ఆపను... | Eminem keeps slamming Donald Trump | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 28 2018 1:04 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Eminem Donald Trump - Sakshi

పాప్‌ సింగర్‌ ఎమినెమ్‌(ఇన్‌సెట్లో ట్రంప్‌).. ఫైల్‌ ఫోటో

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు చేయటం ఆపబోనని క్రేజీ పాప్ సింగర్‌ ఎమినెమ్‌ ఉద్ఘాటించాడు. ట్రంప్‌ పై తన ఆలోచన ధోరణిని, అభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరని అతను అంటున్నాడు. 

‘‘నేను ఆయన్ని(ట్రంప్‌ను) విమర్శించటం అస్సలు ఆపను. నా అభిమానులు నాకు దూరమైన సరే.. ట్రంప్‌ను తిట్టడమే నా ధ్యేయం. హిల‍్లరీ కూడా తప్పులు చేశారని తెలుసు. కానీ, ట్రంప్‌ లాంటి మూర్ఖుడు కాకుండా వేరే ఎవరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నా నేను అంగీకరించేవాడిని. ట్రంప్‌ ఒక చెత్త వ్యక్తి. చెత్త నిర్ణయాలతో అమెరికాను అంతర్జాతీయ సమాజంలో సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాడు. అందుకే అతనంటే నాకు అసహ్యం. ఈ విషయంలో నా సగం మంది అభిమానులు నాకు దూరమైనా.. నా వైఖరి మార్చుకోను’’ అని ఎమినెమ్‌ స్పష్టం చేశాడు.  

45 ఏళ్ల ఈ క్రేజీ పాప్‌ స్టార్‌ గతంలోనూ ట్రంప్‌ పై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.  ట్రంప్‌ లాంటి జోకర్‌కు ఓటేసి గెలిపిస్తే.. మనమంతా పిచ్చొళ్లు కావటం ఖాయమని ఎన్నికల ప్రచార సమయంలో ఎమినెమ్‌ అమెరికన్లను ఉద్దేశించి కామెంట్లు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement