కెండల్ జెన్నర్తో జస్టిన్ బీబర్ డేటింగ్? | Justin Bieber-Kendall Jenner dating? | Sakshi
Sakshi News home page

కెండల్ జెన్నర్తో జస్టిన్ బీబర్ డేటింగ్?

Published Fri, May 2 2014 9:21 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

కెండల్ జెన్నర్తో జస్టిన్ బీబర్ డేటింగ్?

కెండల్ జెన్నర్తో జస్టిన్ బీబర్ డేటింగ్?

ఓ బేబీ.. బేబీ అంటూ చిన్న వయసులోనే తారాపథానికి ఎదిగిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇప్పుడు కెండల్ జెన్నర్ అనే అమ్మడితో డేటింగ్ చేస్తున్నాడట. వీళ్లిద్దరూ కలిసి ఓ డిన్నర్కు వెళ్లి హాయిగా ఆస్వాదిస్తూ తింటూ అందరికీ కనిపించడంతో ఈ కథనాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన మన్హట్టన్లో కెండల్ స్నేహితుడు హైలీ బాల్డ్విన్తో పాటు వీళ్లిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు వీరి డిన్నర్ పార్టీ సాగిందని యూఎస్మాగజైన్.కామ్ తెలిపింది.

భోజనం ముగిసిన తర్వాత ముందుగా బీబర్ అక్కడినుంచి వెళ్లిపోతే.. కాసేపటి తర్వాత మిగిలిన ఇద్దరూ వెళ్లారట. బీబర్ అప్పుడప్పుడు తిరిగే సెలెనా గోమెజ్తో అతడికి ఇప్పుడు చెడిపోయిందని చెబుతున్నారు. జెన్నర్, ఆమె చెల్లెలు కైలీ జెన్నర్ ఇద్దరూ కలిసి జస్టిన్ బీబర్, అతడి బృందంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారని, తెగ వాగుతున్నారని ఇటీవల సెలెనా చెప్పింది. దీన్ని బట్టి కూడా జస్టిన్ బీబర్ ఇప్పుడు కొత్త స్నేహితురాలిని వెతుక్కుని ఆమెతో డేటింగ్కు వెళ్తున్నాడని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement