Yuvraj Singh Bat Flies To Space Becomes First Minted NFT Ever To Be Sent In Orbit: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ తన వ్యక్తిగత నాన్-ఫంజిబుల్ టోకెన్‌లను (ఎన్‌ఎఫ్‌టీ) డిజిటల్ కలెక్టబుల్స్ వెబ్‌సైట్ కొలెక్షన్ భాగస్వామ్యంతో ప్రారంభించాడు.ఈ ఎన్‌ఎఫ్‌టీ టోకెన్ల ద్వారా తన కెరీర్‌లో కొన్ని అత్యుత్తమ క్షణాలను అభిమానులతో పంచుకోనున్నాడు యువీ.
అంతరిక్షంలోకి యువీ బ్యాట్..! తొలి వ్యక్తిగా..
2003 ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన ఐకానిక్ బ్యాట్‌ను హాట్ ఎయిర్ బెలూన్ సహయంతో అంతరిక్షంలోకి పంపారు.అందుకు సంబంధించిన వీడియో అభిమానులకు ఎన్‌ఎఫ్‌టీ రూపంలో అందుబాటులో ఉండనుంది. అయితే అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్‌గా యువీ బ్యాట్ నిలవనుంది. ఈ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. కొలెక్షన్ అధికారిక అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌ఎఫ్‌టీ వీడియో రూపంలో అందుబాటులో ఉండనుంది.
ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ...“నా మొదటి ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను కొలెక్షన్ భాగస్వామ్యంతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కొత్త ప్లాట్‌ఫారమ్‌లో నా అభిమానులతో మరింత దగ్గరగా ఉంటాను. నా క్రికెట్ ప్రయాణంలో అమూల్యమైన కొన్ని క్షణాలను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.
కొలెక్షన్ వ్యవస్థాపకుడు అభయ్ మాట్లాడుతూ... యువరాజ్ 3డీ స్టాచ్యూతో పాటు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ను విడుదల చేయనున్నాము. అతని ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను సొంతం చేసుకునేందుకు అభిమానులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించనున్నామని అన్నారు.
భారత్‌లో ఊపందుకున్న ఎన్‌ఎఫ్‌టీలు..!
భారత్‌లో ఎన్‌ఎఫ్‌టీలపై భారీ ఆదరణను పొందుతుంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖ నటులు ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటుగా ఎన్‌ఎఫ్‌టీ విషయంలో టీమిండియా క్రికెటర్లు కూడా సై అంటున్నారు. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌తో పాటుగా ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్స్‌లోకి యువీ కూడా జాయిన్ అయ్యారు.
చదవండి: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్ పంత్..! దినేష్ కార్తీక్ సరసన...!
Comments
Please login to add a commentAdd a comment