ఆ కీటకం వల పన్నితే తప్పించుకోవడం కష్టం. అందులో చిక్కుకుని గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడవాల్సిందే. అదే సాలీడు (స్పైడర్) ప్రత్యేకత. ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ‘వల పన్నడం’ సాలీడుకు చిటికెలో పని. అనెటా అలానిజ్ గుజార్డో అనే వ్యక్తి టెక్సాస్‌లో నివాసముంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్తున్న క్రమంలో గత బుధవారం ఇంటిపక్కన ఓ భారీ సాలీడు వల చూసి షాక్‌కు గురయ్యాడు. సినిమాలో మాదిరి అంతపెద్ద వల అతని కంటబడటంతో విషయం అర్థమైంది.
ఓ భారీ స్పైడర్.. దాని వలలో చిక్కుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి గింజుకుంటున్న గబ్బిలం కనిపించాయి. అతను చూస్తుండగానే గబ్బిలం వైపు సాలీడు దూసుకొచ్చింది. దానిపైబడి నంజుకు తినేసింది. స్పైడర్ కన్నా ఆ గబ్బిలం పెద్ద సైజులో ఉండటం గమనార్హం. ఇక ఈ విషయాన్నంతా గుజార్డో ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. సాలీడు ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జియోప్ ఆరంటియా జాతికి చెందిన ఈ స్పైడర్ తేనెటీగలు, బొద్దింకలు, కీటకాలు, పక్షుల్ని ఆహారంగా తీసుకుంటాయి వాటికన్నా భారీ ప్రాణలను కూడా అవి ట్రాప్ చేసి ఆహారంగా చేసుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment