
బ్యాట్ల కోసం మీరట్ కు ధోని
మీరట్: గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియా సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం మీరట్ లో బ్యాట్లు సెలెక్టు చేసుకున్నాడు. ఆసీస్ బౌన్సీ పిచ్ లకు అనుకూలంగా ఉండే బ్యాట్లను అతడు ఎంపిక చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఐదు గంటల సమయం వెచ్చించాడు.
1260 గ్రాముల బరువుండే ఆరు బ్యాట్లను ధోని ఎంపిక చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్యాట్ ఆకారంతో పాటు స్ట్రోక్ పరిగణనలోకి తీసుకుని బ్యాట్లు సెలెక్ట్ చేసుకున్నాడని తెలిపాయి. ఆడిలైడ్ లో డిసెంబర్ 12 నుంచి జరిగే రెండో టెస్టులో ధోని ఆడనున్నాడు.