
బ్రిస్బేన్: కొండచిలువ-గబ్బిలం మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూమిమీద వెళ్లే జంతువులను గుర్తించి, వేగంగా వాటిపై దాడి చేసి బంధించి ఆహారంగా తీసుకునే కొండచిలువ నేలపై వాలని గబ్బిలాన్ని పట్టుకోవడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనను వీడియో తీసిన టోనీ మారిసన్ అనే వ్యక్తి నెట్టింట్లో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది.
ఒక చెట్టుపైకి వెళ్లిన కొండచిలువ అక్కడ తల్లకిందులుగా వేలాడుతున్న గబ్బిలాన్ని పట్టేసుకుని చుట్టేసింది. దీంతో గబ్బిలం గింజుకుంది. మింగడానికి కొండచిలువ, ఒదిలించుకునేందుకు గబ్బిలం హోరాహోరీగా పోరాడాయి. సుమారు అరంగటపాటు సాగిన ఈ పోరాటంలో చివరకు విజయం గబ్బిలాన్ని వరించింది. ఆకలి మీద ఉన్న కొండచిలువకు గబ్బిలంతో పోరాడలేక విడిచి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment